LIVE
Screenshot 2026 03 24 112650
వెనక్కి
Politics

జీవన్ రెడ్డి ఇంటికి పీసీసీ చీఫ్...బుజ్జగింపులు

27 రోజుల క్రితం
Telangana
సారాంశం

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారకుండా అధిష్టానం బుజ్జగిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడం, తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో జీవన్ రెడ్డి అలకబూనారు. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇటీవల మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వంటి వారు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా జీవన్ రెడ్డి మెత్తబడలేదు. ఇప్పుడు పీసీసీ చీఫ్ స్వయంగా వచ్చినా... జీవన్ రెడ్డి ఏమాత్రం శాంతించలేదు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ కండువా కప్పే ప్రయత్నం చేయగా... జీవన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు.

షేర్ చేయండి:
24 మార్చి, 2026 11:25 AMకి

సంబంధిత వార్తలు

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్:  మోదీ వెల్లడి

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి

ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.

19 నిమిషాల క్రితం
చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వేద పండితులు స్వామివారి ఆశీస్సులు అందించారు. శ్రీవారి విగ్రహాన్ని జేఈవో వెంకయ్య చౌదరి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.

35 నిమిషాల క్రితం
చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, "శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘకాలం వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

46 నిమిషాల క్రితం
ప్రజల మధ్యే బాబు పుట్టినరోజు

ప్రజల మధ్యే బాబు పుట్టినరోజు

పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన, ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. నారా భువనేశ్వరి గారు రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచితంగా ఆహారం అందించేందుకు రూ. 76 లక్షల విరాళాన్ని అందజేశారు.

57 నిమిషాల క్రితం