సారాంశం
గల్ఫ్ దేశాల్లో చిక్కుకొన్న భారతీయులకు శుభవార్త. దుబాయ్ వంటి కొన్ని ప్రాంతాల నుంచి పాక్షికంగా విమాన సర్వీసులు మొదలయ్యాయి. మంగళవారం నాడు 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం దుబాయ్ నుంచి న్యూడిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. పశ్చిమాసియా లో సైనిక ఘర్షణ జరుగుతున్న వేళ గత 24 గంటల్లో భారత్‌లోకి ప్రవేశించిన తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు ఇదే. ఇక యూఏఈలో ఇరుక్కుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ... ఢిల్లీ, ముంబయి, కొచ్చి లకు నాలుగు ప్రత్యేక విమానాలను నడుపుతామని స్పైస్ జెట్ ప్రకటించింది. యూఏఈ నుంచి వచ్చే విమాన సర్వీసుల వివరాలు ... భారత విదేశాంగ శాఖకు చెందిన ప్రవాస భారతీయుల తరలింపు విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది.
4 మార్చి, 2026 12:42 PMకి