LIVE
కర్నాటకలో సోషల్ మీడియాపై నిషేధం
వెనక్కి

కర్నాటకలో సోషల్ మీడియాపై నిషేధం

44 రోజుల క్రితం
సారాంశం

కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 16ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని సీఎం సిద్ధారామయ్య ప్రస్తావించారు. పిల్లల మానసిక ఆరోగ్యం, చదువు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.స్మార్ట్‌ఫోన్ల వాడకంతో పిల్లలు డిజిటల్ వ్యసనానికి గురవుతున్నారని, దీనివల్ల వారి కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ దెబ్బతింటున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, కొన్ని యూరోపియన్ దేశాలు ఇప్పటికే ఇటువంటి నిషేధాలను అమలు చేస్తున్నాయి. అదే తరహాలో పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుండి రక్షించడానికి కర్ణాటక ప్రభుత్వం ఈ అడుగు వేసింది

షేర్ చేయండి:
6 మార్చి, 2026 12:22 PMకి