LIVE
Screenshot 2026 04 21 113328
వెనక్కి
National

కాశ్మీర్‌లో ఆర్మీ ఆపరేషన్.. ముగ్గరు టెర్రరిస్టులు హతం

6 గంటల క్రితం
Telangana
సారాంశం

జమ్మూ కశ్మీర్‌లో భారత సైన్యం మెరుపు దాడి జరిపి ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులను హతమార్చింది. ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. లొంగిపోవాలంటూ 5 నిమిషాల గడువు ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఆపరేషన్ ప్రారంభించింది. జరిగిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టి ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది.

షేర్ చేయండి:
21 ఏప్రిల్, 2026 11:35 AMకి

సంబంధిత వార్తలు

ఆ సత్తా రాహుల్ గాంధీకి లేదు :లాలూ తనయుడు

ఆ సత్తా రాహుల్ గాంధీకి లేదు :లాలూ తనయుడు

లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ రాహుల్ గాంధీపై హాట్ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమిని నడిపించే సత్తా రాహుల్ కు లేదని, ప్రియాంకగాంధీ మాత్రమే సమర్థవంతంగా నడపగలరని అన్నారు. ప్రియాంకను ఇందిరాగాంధీతో పోల్చారు తేజ్ ప్రతాప్. నితీష్ కుమార్ రాజీనామా చేసి వెళ్లిపోయారని, మరొకరు ముఖ్యమంత్రి అయ్యారని..అయినా రాహుల్ నితీశ్ గురించి మాట్లాడడంలో ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు తేజ్ ప్రతాప్.

1 గంటల క్రితం
OPERATION PAHLGHAM : పాక్‌కు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్

OPERATION PAHLGHAM : పాక్‌కు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్

పహల్గామ్ దాడి ఘటనకు రేపటితో ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను విడుదల చేసింది. కొన్ని బౌండరీలు ఎప్పటికీ దాటకూడదు, భారత్ ఎప్పటికీ మర్చిపోదు అనే టెక్స్ట్ తో ఉండే పోస్ట్ షేర్ చేసింది. హద్దులు దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్ పై విరుచుకుపడింది.

1 గంటల క్రితం
భూ ప్రకంపనలు..జనం పరుగులు

భూ ప్రకంపనలు..జనం పరుగులు

మణిపూర్‌తో పాటు నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో 5.2 తీవ్రతతో మంగళవారం ఉదయం 5:59 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. మణిపూర్‌లోని కామ్‌జాంగ్ ప్రాంతంలో కేంద్రంగా భూమి కంపించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ నెలలో ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు రావడం ఇది రెండోసారి.

1 గంటల క్రితం
మోదీని ఉగ్రవాదితో పోల్చిన ఖర్గే

మోదీని ఉగ్రవాదితో పోల్చిన ఖర్గే

తమిళనాడు ఎన్నికల పర్యటనలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉగ్రవాదితో పోల్చారు. ఉగ్రవాదితో అన్నాడీఎంకే పొత్తు ఎలా పెట్టుకుంటుంది అని ఖర్గే ప్రశ్నించారు. దక్షిణాది హక్కులను ప్రధాని మోదీ హరిస్తున్నారని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

1 గంటల క్రితం