పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల కోసం హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని 'ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ' తో మజ్లిస్ పొత్తు పెట్టుకుంది. మైనారిటీల హక్కుల కోసం, ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉన్న ప్రాంతాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు ఆయన తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోందని, అందుకే తాము ప్రత్యామ్నాయంగా బరిలోకి దిగుతున్నామని ఓవైసీ పేర్కొన్నారు. ముస్లింల ఓట్లను మజ్లిస్ పార్టీ చీల్చినట్లయితే ... మమతా బెనర్జీ పార్టీకి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.

చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వేద పండితులు స్వామివారి ఆశీస్సులు అందించారు. శ్రీవారి విగ్రహాన్ని జేఈవో వెంకయ్య చౌదరి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.
.png)
చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, "శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘకాలం వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
.png)
ప్రజల మధ్యే బాబు పుట్టినరోజు
పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన, ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. నారా భువనేశ్వరి గారు రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచితంగా ఆహారం అందించేందుకు రూ. 76 లక్షల విరాళాన్ని అందజేశారు.
