LIVE
Kadiam Srihari 1
వెనక్కి

కేసీఆర్ కు కడియం సవాల్

41 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

కేసీఆర్ క్షమాపణ చెప్పితే తాను రాజీనామాకు సిద్ధమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో జరిగిన ఫిరాయింపులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు తనకు మాత్రమే వర్తింస్తాయా? కేసీఆర్‌కు వర్తించవా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తన హయాంలో జరిగిన ఫిరాయింపులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ క్షమాపణ చెప్పితే నేను రాజీనామాకు సిద్ధం’ అని స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేసీఆర్ మంత్రులుగా చేయలేదా? అని ప్రశ్నించారు. టీడీపీ శాసనసభా పక్షం బీఆర్‌ఎస్‌లో విలీనం కాకముందే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రిని చేశారని, ఇది నైతికమా? అని సవాల్ విసిరారు. రాజకీయంగా తమను ఎదగకుండా చేయడానికే కేసీఆర్ జిల్లాల విభజన చేశారని కడియం శ్రీహరి ఆరోపించారు.

షేర్ చేయండి:
11 మార్చి, 2026 03:19 PMకి