హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు తిరుగుబాటు చేశారు. ధర్మారంలో రహస్యంగా భేటీ అయిన సీనియర్ నాయకులు తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటించనున్నారు. ఎమ్మెల్యే తీరు వల్ల నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులను ఎమ్మెల్యే కనీసం గౌరవించడం లేదని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకున్న వారిని గాలికి వదిలేసి, తన సొంత అజెండా కోసం అందరినీ వాడుకుంటున్నారని నేతలు వాపోయారు. అసమ్మతి గళం వినిపించిన ప్రముఖులలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్లు తక్కల్లపల్లి రాజేశ్వరరావు, పోడేటి రామస్వామి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఎడవెల్లి కొండారెడ్డి, జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్, పింగిలి రమేష్, కన్నూరు సత్యనారాయణ రావు, చుక్క రంజిత్, విజయభాస్కర్ రెడ్డి, పింగళి ప్రదీప్ రెడ్డి, బాలసాని కుమారస్వామి, బచ్చు శివకుమార్, వెంకట్ రెడ్డి, తోట లక్ష్మణ్, కృష్ణారెడ్డి సహా పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ఉన్నారు. వీరు తమ తదుపరి ప్రణాళికను త్వరలోనే బహిరంగంగా ప్రకటిస్తామని స్పష్టం చేయడంతో హుజూరాబాద్ గులాబీ పార్టీలో ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
సంబంధిత వార్తలు

EC WARNING: సోషల్ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు
ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి
రాష్ట్రాభివృద్ధిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని నేతలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వ సేవల వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేశారు.

JAGITYAALA JUNG : జగిత్యాలలో ఉద్రిక్తత.. ఫ్లెక్సీలు ధ్వంసం
జగిత్యాలలో ఉద్రక్తిత పరిస్థితులు నెలకొన్నాయి. రేపు కేసీఆర్ భారీ బహిరంగ సభ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదంగా మారాయి. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం ఏర్పాటు చేసుకున్న జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను సంజయ్ వర్గం చింపింది. దీంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఓ పిక్ పాకెటర్: కేంద్రమంత్రి
కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. CM రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో కేవలం గాంధీ కుటుంబానికే ప్రాధాన్యత ఉంటుందని, అది వారసత్వ రాజకీయాలకు నిలయమని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవడం ద్వారా ఇండీ కూటమి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.