LIVE
Download (5) 2
వెనక్కి
GeneralPolitics

డోన్ట్ వర్రీ.. ప్రధాని మోదీ ప్రకటన

27 రోజుల క్రితం
సారాంశం

దేశంలో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్ తన వ్యూహాత్మక నిల్వలను పెంచుకుంటోందని ఆయన పేర్కొన్నారు. గతంలో 27 దేశాల నుంచే చమురు దిగుమతి చేసుకునేవారమని, ఇప్పుడు ఆ సంఖ్యను 41కి పెంచి వనరులను వైవిధ్యీకరించామని తెలిపారు. దేశ ఇంధన అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు.

షేర్ చేయండి:
24 మార్చి, 2026 07:22 AMకి

సంబంధిత వార్తలు

జగన్ అందుకే తల్లికి విషెస్ చెప్పలేదా..?

జగన్ అందుకే తల్లికి విషెస్ చెప్పలేదా..?

తన తల్లి జన్మదినంపై జగన్‌ మౌనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైఎస్ విజయలక్ష్మి 70వ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల, లోకేశ్ ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే జగన్ నుంచి ఎలాంటి స్పందన రాక పోవడం గమనార్హం. ఆర్దిక వివాదాల నేపథ్యంలోనే జగన్ తన తల్లి పుట్టిన రోజును పట్టించుకోలేదనే వాదనలు వినిపి స్తున్నాయి. ఇదే సమయంలో శస్త్రచికిత్స అనంతరం పవన్‌కల్యాణ్ త్వరగా కోలుకోవాలని జగన్ ట్వీట్ చేశారు.

1 గంటల క్రితం
76వ వసంతంలోకి అడుగు పెట్టిన సీఎం చంద్రబాబు

76వ వసంతంలోకి అడుగు పెట్టిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. సమకాలీన రాజకీయ ప్రపంచంలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, ప్రజలు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. 76 ఏళ్ళ వయస్సులోనూ అలుపెరుగ కుండా పని చేస్తున్న చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.

1 గంటల క్రితం
ఉదయం 5 గం. నుంచే మెట్రో రైల్ సర్వీసులు..?

ఉదయం 5 గం. నుంచే మెట్రో రైల్ సర్వీసులు..?

హైదరాబాద్‌లో మెట్రో సేవల సమయాలు త్వరలో మారే అవకాశం ఉంది . ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్న మెట్రోను 5 గంటల నుంచే నడపాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ కు సీఎస్ రామకృష్ణారావు విజ్ఞప్తి చేశారు. తెల్లవారు జామునే సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లకు చేరే రైళ్ళతో పాటు ,వందేభారత్, రాజధాని, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ల కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. టైమింగ్స్ మార్చాలని లేఖ రాశారు.

1 గంటల క్రితం
ఇవాళ మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి

మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పరిశీలించనున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహ దేవ్‌పూర్ వద్ద గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీ రెండున్నరేళ్ల క్రితం కుంగిపోవడంతో పునరుద్ధరణ పనులు కొనసాగుతు న్నాయి. బోర్‌ డ్రిల్లింగ్‌ సహా జరుగుతున్న పనులను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. NDSA మార్గదర్శకాల మేరకు చర్యలు వేగవంతం చేయాలని ఇప్పటికే ఆదేశించారు. అనంతరం సీఎం సమీక్ష నిర్వహిస్తారు.

1 గంటల క్రితం