మోదీ అదిరిపోయే డ్రామా..మమతా బెనర్జీ మాస్ కౌంటర్!
ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనలో 'ఝల్ మురి' తినడాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. అదంతా పక్కాగా ప్లాన్ చేసిన 'డ్రామా' అని కొట్టిపారేశారు. అది అనుకోకుండా చేసిన ఆగడమే అయితే, అప్పటికే అక్కడ కెమెరాలు, మైక్రోఫోన్లు ఎలా సిద్ధంగా ఉన్నాయని ప్రశ్నించారు. అసలు మోదీ జేబులో పది రూపాయల నోటు ఉండటం నమ్మశక్యంగా లేదని, అదంతా స్క్రిప్టెడ్ ఈవెంట్ అని మమత తెలిపారు.
సంబంధిత వార్తలు

ఆ సత్తా రాహుల్ గాంధీకి లేదు :లాలూ తనయుడు
లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ రాహుల్ గాంధీపై హాట్ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమిని నడిపించే సత్తా రాహుల్ కు లేదని, ప్రియాంకగాంధీ మాత్రమే సమర్థవంతంగా నడపగలరని అన్నారు. ప్రియాంకను ఇందిరాగాంధీతో పోల్చారు తేజ్ ప్రతాప్. నితీష్ కుమార్ రాజీనామా చేసి వెళ్లిపోయారని, మరొకరు ముఖ్యమంత్రి అయ్యారని..అయినా రాహుల్ నితీశ్ గురించి మాట్లాడడంలో ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు తేజ్ ప్రతాప్.

OPERATION PAHLGHAM : పాక్‌కు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్
పహల్గామ్ దాడి ఘటనకు రేపటితో ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను విడుదల చేసింది. కొన్ని బౌండరీలు ఎప్పటికీ దాటకూడదు, భారత్ ఎప్పటికీ మర్చిపోదు అనే టెక్స్ట్ తో ఉండే పోస్ట్ షేర్ చేసింది. హద్దులు దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్ పై విరుచుకుపడింది.
భూ ప్రకంపనలు..జనం పరుగులు
మణిపూర్‌తో పాటు నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో 5.2 తీవ్రతతో మంగళవారం ఉదయం 5:59 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. మణిపూర్‌లోని కామ్‌జాంగ్ ప్రాంతంలో కేంద్రంగా భూమి కంపించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ నెలలో ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు రావడం ఇది రెండోసారి.
మోదీని ఉగ్రవాదితో పోల్చిన ఖర్గే
తమిళనాడు ఎన్నికల పర్యటనలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉగ్రవాదితో పోల్చారు. ఉగ్రవాదితో అన్నాడీఎంకే పొత్తు ఎలా పెట్టుకుంటుంది అని ఖర్గే ప్రశ్నించారు. దక్షిణాది హక్కులను ప్రధాని మోదీ హరిస్తున్నారని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.