ఐసీసీ టోర్నీల్లో అయిదు టైటిళ్లు గెలిచిన భారత జట్లను నమన్ అవార్డులతో సన్మానించనున్నారు. ఢిల్లీలో ఆదివారం ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది. మార్చి 8వ తేదీన జరిగిన ఫైనల్లో సూర్య కుమార్ నేతృత్వంలోని భారత జట్టు టీ20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సూర్య బృందంతో పాటు 2025లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన మహిళల జట్టు, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పురుషుల జట్టు, 2026 అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టు, 2025 మహిళ అండర్19 వరల్డ్‌కప్ బృందాలను కూడా సత్కరించనున్నారు. అదేవిధంగా అనేక మంది క్రికెటర్లకు వ్యక్తిగత అవార్డలను కూడా ఇవ్వనున్నది. టెస్టు, వన్డే కెప్టెన్ గిల్‌కు పాలీ ఉమ్రిగర్ అవార్డును ఇవ్వనున్నారు. మహిళల్లో బెస్ట్ ఇంటర్నేషన్ క్రికెటర్ అవార్డును స్మృతీ మంధానాకు ఇవ్వనున్నారు. మాజీ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్‌కు .. కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును అందజేయనున్నారు. ఇక బీసీసీఐ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అందుకోనున్నారు.
సంబంధిత వార్తలు

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ
రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఓటమి అంచున ఉన్న జట్టును రింకూ సింగ్ (53*), అనుకుల్ రాయ్ (29*) మెరుపు ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించారు. అంతకుముందు వరుణ్ చక్రవర్తి (3/14) ధాటికి రాజస్థాన్ 155 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఖాతాలో ఇది క్రేజీ విక్టరీ!

టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు
క్రికెట్ స్టార్ ఇషాన్ కిషన్‌ను అచ్చుగుద్దినట్లు ఉన్న వ్యక్తి టీ స్టాల్ వద్ద కనిపించడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఆ వ్యక్తి హావభావాలు, జుట్టు చూసి "ఇషాన్ టీ కొట్టు పెట్టాడా?" అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఐపీఎల్ వేళ ఈ వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

జియోహాట్‌స్టార్ షాక్.. ఈడెన్‌లో ఫ్యాన్స్ ఫైర్
KKR vs RR మ్యాచ్ సందర్భంగా జియోహాట్‌స్టార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లైవ్ స్ట్రీమింగ్ మధ్యలో నిలిచిపోవడం, బఫరింగ్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. కీలక సమయంలో స్ట్రీమింగ్ ఆగిపోవడంతో మ్యాచ్ చూడలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ ఫిర్యాదు చేస్తున్నారు.

జురెల్ ‘మెరుపు’ స్టంపింగ్.. సచిన్ ఫిదా!
కేకేఆర్‌తో పోరులో రాజస్థాన్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత స్టంపింగ్‌తో గ్రీన్‌ను అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గాల్లో డైవ్ చేస్తూ జురెల్ చేసిన ఈ విన్యాసానికి క్రికెట్ లెజెండ్ సచిన్ ప్రశంసలు కురిపించారు. "మెరుపు వేగంతో అద్భుతం చేశావు ధ్రువ్" అంటూ ట్వీట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.