LIVE
Nellore Ganja Trees Case
వెనక్కి
Crime

రెండు మొక్కలు.. మూడేళ్లు జైలుశిక్ష

40 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

> నెల్లూరులో గంజాయి మొక్కల్ని పెంచాడు > పక్కా సమాచారంతో అరెస్ట్ చేసిన పోలీసులు > మూడేళ్ల జైలు శిక్ష విధించిన నెల్లూరు కోర్టు 2022లో ఓ యువకుడు చేసిన తప్పుకు ఇప్పుడు మూడేళ్ల జైలు శిక్ష పడింది. నెల్లూరుకు చెందిన యువకుడు రవూఫ్ ఇంట్లోనే గంజాయి మొక్కల్ని పెంచాడు. ఎక్సైజ్ పోలీసులు పక్కా సమాచారంతో వెళ్లి ఈ గుట్టు బయటపెట్టారు. వెంటనే ఆ మొక్కల్ని స్వాధీనం చేసుకుని అతడ్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరగ్గా.. అతడికి మూడేళ్ల పాటూ జైలు శిక్ష పడింది. నాలుగేళ్ల క్రితం కేసు ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్ అయ్యింది.

షేర్ చేయండి:
12 మార్చి, 2026 10:58 AMకి

సంబంధిత వార్తలు

కేరళ: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఆరుగురు మృతి!

కేరళ: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఆరుగురు మృతి!

కేరళ రాష్ట్రం త్రిస్సూరులో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 40మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఘటనా స్థలంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

15 నిమిషాల క్రితం
BRS UPDATE : రేవంత్ ఓటుకు నోటు కేసుపై పోరాటం

BRS UPDATE : రేవంత్ ఓటుకు నోటు కేసుపై పోరాటం

రేవంత్ రెడ్డికి సంబంధించిన 'ఓటుకు నోటు' కేసు విచారణ రేపు సుప్రీంకోర్టులో జరగనుందని BRS నేత హరీష్ రావు తెలిపారు. రేవంత్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూత్రా ఉన్నారని, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తాము కూడా ఈ కేసులో కోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమించినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం ప్రభుత్వం ఒక బలహీనమైన PPని నియమించిందని ఆరోపించారు.

36 నిమిషాల క్రితం
పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. విజయనగరంలో ఘోర ప్రమాదం!

పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. విజయనగరంలో ఘోర ప్రమాదం!

* నరవ గ్రామంలో తీవ్ర విషాదం.. వివాహం నిశ్చయమైన యువతి రేణుక (18) రోడ్డు ప్రమాదంలో మృతి. * బట్టల షాపు ప్రచారం కోసం ఆటోలో వెళ్తుండగా, గ్రామ శివారులో ప్రమాదవశాత్తూ కింద పడటంతో తలకు తీవ్ర గాయమై ప్రాణాలు కోల్పోయింది. * పెళ్లి పనులు మొదలవ్వాల్సిన ఇంట్లో చావు మేళం వినిపిస్తుండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. విధి ఆడిన వింత నాటకంలో విగతజీవిగా మారిన యువతి!

48 నిమిషాల క్రితం
వెరైటీ దొంగ ... కేవలం నైట్ బస్సుల్లోనే చోరీలు

వెరైటీ దొంగ ... కేవలం నైట్ బస్సుల్లోనే చోరీలు

శివా రెడ్డి అనే వెరైటీ దొంగను పోలీసులు పట్టుకొన్నారు. కేవలం రాత్రి సమయాల్లో బస్సుల్లో ప్రయాణిస్తూ, నిద్రపోతున్న ప్యాసింజర్స్ దగ్గర నుంచి పర్సులు కొట్టేస్తుంటాడు. తాజాగా ఒక బస్సులో లేడీ డాక్టర్ నుంచి బంగారు ఆభరణాలు కొట్టేశాడు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా దొరికిపోయాడు.

52 నిమిషాల క్రితం