-1.jpg)
🚨 నెల్లూరులో కూల్ డ్రింక్స్ లారీ బోల్తా.. బాటిళ్ల కోసం జనం పరుగులు !
నెల్లూరు జిల్లాలోని బుజబుజ నెల్లూరు సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సాఫ్ట్ డ్రింక్స్ (Cool Drinks) లోడ్‌తో వెళ్తున్న ఒక లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలోని వందలాది కూల్ డ్రింక్ బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్‌ను కాపాడాల్సింది పోయి.. అక్కడికి చేరుకున్న స్థానికులు, బాటసారులు రోడ్డుపై పడ్డ కూల్ డ్రింక్ బాటిళ్లను ఎత్తుకెళ్లడానికి పోటీ పడ్డారు. కేవలం 10 నిమిషాల్లోనే లారీలోని స్టాక్ మొత్తాన్ని జనం ఖాళీ చేసేశారు. కొందరు సంచుల్లో, మరికొందరు చేతుల్లో దొరికినన్ని బాటిళ్లను పట్టుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన వల్ల జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
సంబంధిత వార్తలు

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా
నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్
ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్‌గా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు.

ఇరాన్ ఒప్పుకుంటే సరి..లేదంటే నేనేంటో చూపిస్తా: ట్రంప్
తమ ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్‌లోని ప్రతి విద్యుత్ కేంద్రాన్ని, వంతెనను నాశనం చేస్తామంటూ...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య రెండో దఫా చర్చల కోసం రేపు అమెరికా ప్రతినిధి బృందం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లనుంది. తమ ప్రతిపాదనలకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు ట్రంప్. లేకపోతే తానేంటో చూపిస్తానంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
రేపు చంద్రబాబు బర్త్ డే...లోకేష్ సర్ ప్రైజ్
రేపు ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే ను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు భారీగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. చంద్రబాబు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా... ఆయన తనయుడు, మంత్రి లోకేష్ ఒక కామన్ డిస్‌ప్లే పిక్చర్ ని విడుదల చేశారు. ఈ సీడీపీ విడుదలతో టీడీపీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చుకుంటూ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.