టికెట్ రేట్ల పెంపుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు ఎవరూ...దేహి అనద్దు. మీరు ఎంత కష్టపడి తీస్తారో నాకు తెలుసు అని ఆయన చెప్పారు. “సినిమాని తెలుగు ప్రేక్షకుల నుంచి గానీ, భారతదేశం నుంచి గానీ దూరం చేయలేము. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద సోల్ ఆఫ్ దిస్ నేషన్. అది మన సంస్కృతులకు మూలం. అందుకని ఈ సినిమాని మన జీవితాల్లో నుంచి తీసేయలేము. అలాగే, నాకు ఎప్పుడూ ఏ హీరో విజయం మీద ఇన్సెక్యూరిటీ ఉండదు. అందరూ బాగుండాలని కోరుకుంటాను. ‘సర్వేజనో సుఖినోభవంతు’ అంటే నేను ఒక్కడినే బాగుండాలి, మిగతావాళ్ళు పోవాలి అని కాదు.. అందరూ బాగుండాలని కోరుకుంటాను. అలాగే నేను చాలా పర్యాయాలు చెప్తా ఉంటాను. దయచేసి మీరు దేహి అనద్దు. మీరు ఎంత కష్టపడి తీస్తారో నాకు తెలుసు. పైగా మీరు పెంచిన ప్రతి రూపాయిలో 18% జీఎస్టీకి వెళ్తది. వదిలేస్తే ఎవరో బ్లాక్‌లో టికెట్లు అమ్ముకొని మళ్ళీ అది క్యాష్‌గా వెళ్ళిపోద్ది. అది గవర్నమెంట్‌కి రెవెన్యూ కాదు, ఎవరికీ కాదు. దీన్ని బేస్ చేసుకొని.. నేను ఆంధ్రప్రదేశ్‌కి, ప్రత్యేకించి అది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి నేను మనస్ఫూర్తిగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీరో.. అది ‘పుష్ప’ కావచ్చు, లేదంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, మహేష్ గారిది కావచ్చు (మహేష్ గారి సినిమా రిలీజ్ అయిందో లేదో తెలియదు కానీ నాకు ఈ మధ్య కాలంలో), ఏ సినిమా వచ్చినా గానీ, ఇంక్లూడింగ్ ‘కల్కి’ ప్రభాస్ గారు కావచ్చు, ఇంక్లూడింగ్ మన ‘కాంతార’ కూడా. కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు కూడా పడకూడదు అని అన్నా గానీ, నేను ‘కాంతార’కి ఆ వివక్ష చూపించలేదు. అసలు మనది భారతదేశపు సినిమా, ఇది ఎక్కడైనా ఆడాలి. ఇది మన ఒక్కరిది కాదు, మనందరం బాగుండాలని నేను కోరుకుంటాను” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
సంబంధిత వార్తలు

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్
ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్‌గా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు.

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ
విష్ణు ప్రియ ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంలో నటి అనన్య నాగళ్లపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. వాటికి ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ ఫీచర్ గురించి, దీంతో కలిగే ప్రయోజనాల గురించి తాను 2025లోనే క్లారిటీ ఇచ్చానని అనన్య గుర్తు చేశారు. అసలు విషయం తెలుసుకోకుండా కేవలం విమర్శల కోసమే కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పుష్ప 2 బాహుబలి 2. మధ్యలో...?
భారీ వసూళ్ల రికార్డులు సాధించిన సినిమాల్లో పుష్ప 2, బాహుబలి 2కి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రెండు సినిమాలు చాలా కాలంగా టాప్ గ్రాసర్స్ జాబితాలో రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ స్థానాలను కదిలించేలా బాలీవుడ్ స్పై థ్రిల్లర్ దురంధర్-2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గతేడాది విడుదలైన పుష్ప 2 వసూళ్లను అధిగమిస్తూ తాజాగా దురంధర్-2 సత్తా చాటింది.