LIVE
Pemmasani
వెనక్కి
Politics

ఒకే పంట కాకుండా ఎక్కువ పంటలు వేయాలి: పెమ్మసాని

29 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

రైతులు ఒకే పంట కాకుండా ఎక్కువ పంటలు వేయాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు. గుంటూరు కొర్నెపాడులో శనివారం నిర్వహించిన రైతు నేస్తం ఫౌండేషన్ పదో వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మిద్దెతోటలు సాగుచేస్తున్న మహిళలకు ఆయన అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పురుగుమందులు లేకుండా వ్యవసాయం చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మిద్దె తోటల పెంపకందారుల సమూహం ఉందని తనకు ఇప్పటివరకూ తెలియదని చెప్పారు. వ్యవసాయం చేసే చాలామంది రైతులకు ఆదాయం రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ డిమాండ్‌పై అవగాహన పెంచుకున్నాక పంటలు వేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయంతో సరిపెట్టకుండా ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారని కొనియాడారు. రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడితే లబ్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రైతులు సంఘటితమైతేనే వ్యాపారుల పెత్తనం తగ్గుతుందని చెప్పారు.

షేర్ చేయండి:
21 మార్చి, 2026 04:55 PMకి

సంబంధిత వార్తలు

EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

2 గంటల క్రితం
తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి

రాష్ట్రాభివృద్ధిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని నేతలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వ సేవల వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేశారు.

4 గంటల క్రితం
JAGITYAALA JUNG : జగిత్యాలలో ఉద్రిక్తత.. ఫ్లెక్సీలు ధ్వంసం

JAGITYAALA JUNG : జగిత్యాలలో ఉద్రిక్తత.. ఫ్లెక్సీలు ధ్వంసం

జగిత్యాలలో ఉద్రక్తిత పరిస్థితులు నెలకొన్నాయి. రేపు కేసీఆర్ భారీ బహిరంగ సభ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదంగా మారాయి. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం ఏర్పాటు చేసుకున్న జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను సంజయ్ వర్గం చింపింది. దీంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

4 గంటల క్రితం
సీఎం రేవంత్ రెడ్డి ఓ పిక్ పాకెటర్: కేంద్రమంత్రి

సీఎం రేవంత్ రెడ్డి ఓ పిక్ పాకెటర్: కేంద్రమంత్రి

కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. CM రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో కేవలం గాంధీ కుటుంబానికే ప్రాధాన్యత ఉంటుందని, అది వారసత్వ రాజకీయాలకు నిలయమని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవడం ద్వారా ఇండీ కూటమి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

4 గంటల క్రితం