హార్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 85.89 డాలర్లకు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర 90.13 డాలర్లకు చేరుకుంది. 2027 వరకు అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్‌కు 3 డాలర్ల పైన ఉండే అవకాశం ఉందని అమెరికా ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
పుణ్యక్షేత్రాల దర్శనానికి టైం ఫిక్స్.. IRCTC స్పెషల్ టూర్
వేసవిలో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారికి IRCTC అదిరిపోయే ప్యాకేజీని ప్రకటించింది. మే 12న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో మాతా వైష్ణోదేవి, మథుర, హరిద్వార్, రిషికేశ్ వంటి క్షేత్రాలను దర్శించుకోవచ్చు. 9 రాత్రులు, 10 పగళ్ల పాటు సాగే ఈ యాత్రకు టికెట్ ధర రూ. 16,500 నుంచి ప్రారంభమవుతుంది. భరత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఈ ప్రయాణం సాగుతుంది.

GREAT INDIA: ప్రపంచానికి భారత రైల్వే శక్తి
Indian Railways మరోసారి తన తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. Banaras Locomotive Worksలో తయారైన చివరి రెండు 3,300 హెచ్‌పీ లోకోమోటివ్‌లు Maputoకు చేరడంతో, Mozambiqueకు మొత్తం 10 లోకోమోటివ్‌ల సరఫరా విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా “Make in India, Make for the World” లక్ష్యాన్ని భారత్ మరింత బలంగా నిలబెట్టింది.

సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవంలో ప్రముఖుల సందడి!
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఉదయాన్నే స్వామి వారిని దర్శించుకున్నారు . ప్రభుత్వ అధికారులు, శారదా పీఠాధిపతులు, ప్రభుత్వ ప్రతినిధులు స్వామి వారిని దర్శించుకున్నారు

పిఠాపురం బేకరీలో పురుగుల బిస్కెట్లు..
AP: పిఠాపురంలో బేకరీ బిస్కెట్లలో పురుగులు బయటపడటం కలకలం రేపింది. కాకినాడ జిల్లా రూత్ నీలిమ బేకరీలో కొనుగోలు చేసిన బిస్కెట్లను కుమారుడికి ఇస్తుండగా జీవన్‌నగర్‌కు చెందిన డేవిడ్ పురుగులు గుర్తించారు. యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు బేకరీ షట్టర్లు మూసివేసి ఆందోళనకు దిగారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీలు లేకపోవడమే కారణమని ఆరోపిస్తున్నారు.
.png)