LIVE
Download (2)
వెనక్కి
CrimeInternational

రొట్టె కావాలన్నా లొంగిపోవాల్సిందే! POKలో మహిళలపై ఉగ్రవాదుల పైశాచికం..

18 రోజుల క్రితం
సారాంశం

POK (పాక్ ఆక్రమిత కశ్మీర్) లోని కశ్మీరీ మహిళలు మరియు బాలికలపై ఉగ్రవాదులు చేస్తున్న దారుణాలను పాక్ మతబోధకుడు ముఫ్తీ సయ్యద్ ఖాన్ బయటపెట్టారు. *రిఫ్యూజీ క్యాంపుల్లోని నిస్సహాయ మహిళలను, బాలికలను ఉగ్రవాదులు తమ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి వాడుకుంటున్నారని ఆయన వెల్లడించారు. * కనీసం ఒక రొట్టె కావాలన్నా వారి కోరిక తీర్చాల్సిన దుస్థితి అక్కడ ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. * ఈ వ్యాఖ్యల ద్వారా పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు జరుగుతున్నాయని ఆ దేశమే పరోక్షంగా అంగీకరించినట్లయిందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.

షేర్ చేయండి:
2 ఏప్రిల్, 2026 08:28 AMకి

సంబంధిత వార్తలు

అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది చిన్నారులు బలి

అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది చిన్నారులు బలి

అమెరికాలోని లూసియానాలో కాల్పుల కలకలం రేగింది. రద్దీ ప్రాంతంలో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో 8 మంది పిల్లలు మృతి చెందారు. మృతుల వయసు 1 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్నట్లు ష్రీవ్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం నిందితుడు కారు దొంగిలించి పారిపోవడానికి యత్నించగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్టు తెలిపారు.

1 గంటల క్రితం
మలి విడత చర్చలకు రెడీ అవుతున్న ఇరాన్, అమెరికా

మలి విడత చర్చలకు రెడీ అవుతున్న ఇరాన్, అమెరికా

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పాకిస్థాన్ లో మలి విడత చర్చలకు రంగం సిద్ధం అవుతోంది. ట్రంప్ రెచ్చ గొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చల ప్రక్రియపై అందరి దృష్టీ కేంద్రీకృతం అయి ఉంది. అమెరికా ప్రతినిధులు సోమవారం పాక్ చేరుకుంటారని భావిస్తున్నారు. ఇరాన్ ప్రతినిధుల రాకపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే.. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అంగీకరించక పోతే భారీ వినాశనం తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు.

2 గంటల క్రితం
కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతగా ఉన్న భార్యను భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. విచక్షణారహితంగా పొడవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కత్తితో పొడిచిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

10 గంటల క్రితం
BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

11 గంటల క్రితం