సారాంశం
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న పోలవరం అథారిటీ కార్యాలయాన్ని ఎట్టకేలకు ఏపీలోని రాజమండ్రికి తరలించటానికి రూట్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు అయిన 12 సంవత్సరాల తరువాత ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం. మార్చి 27 లోగా తరలింపు ప్రక్రియ పూర్తి అవుతుందని భావిస్తున్నారు.
4 మార్చి, 2026 12:23 PMకి