LIVE
MV5BMjQ5MGJhODUtYTJiZC00MDI3LWFhMDItMGUyODI1ZGU3ZmI4XkEyXkFqcGc@. V1
వెనక్కి
Entertainment

పవర్ స్టార్ 'ఉస్తాద్ భగత్ సింగ్ ' విడుదలకు ముందే సరికొత్త రికార్డులు

41 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ దర్శకుడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. ఎస్. థమన్ సంగీతం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ నెల 19వ తేదీన తెలుగు ఉగాది పండుగ సందర్బంగా విడుదలకానుంది. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. దీనికి కారణం ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనివున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే విదేశీ మార్కెట్‌లో సత్తా చాటుతోంది ముఖ్యంగా, నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తుంది. అక్కడ ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.41 లక్షలు)పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో బుకింగ్స్ మరింత పుంజుకుంటాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు విదేశాల్లో ఉన్న బలమైన ఫ్యాన్ బేస్, అలాగే, హరీష్ శంకర్ - పవన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తుండటంతో ఈ క్రేజ్ ఏర్పడింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే నార్త్ అమెరికా మార్కెట్‌లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు. ఈ జోరు చూస్తుంటే ప్రీమియర్లతోనే భారీ వసూళ్లు రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

షేర్ చేయండి:
9 మార్చి, 2026 12:32 PMకి

సంబంధిత వార్తలు

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.

9 గంటల క్రితం
మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్‌గా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు.

9 గంటల క్రితం
ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ

విష్ణు ప్రియ ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంలో నటి అనన్య నాగళ్లపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్‌ వస్తున్నాయి. వాటికి ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ ఫీచర్ గురించి, దీంతో కలిగే ప్రయోజనాల గురించి తాను 2025లోనే క్లారిటీ ఇచ్చానని అనన్య గుర్తు చేశారు. అసలు విషయం తెలుసుకోకుండా కేవలం విమర్శల కోసమే కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

11 గంటల క్రితం
పుష్ప 2 బాహుబలి 2. మధ్యలో...?

పుష్ప 2 బాహుబలి 2. మధ్యలో...?

భారీ వసూళ్ల రికార్డులు సాధించిన సినిమాల్లో పుష్ప 2, బాహుబలి 2కి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రెండు సినిమాలు చాలా కాలంగా టాప్ గ్రాసర్స్ జాబితాలో రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ స్థానాలను కదిలించేలా బాలీవుడ్ స్పై థ్రిల్లర్ దురంధర్-2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గతేడాది విడుదలైన పుష్ప 2 వసూళ్లను అధిగమిస్తూ తాజాగా దురంధర్-2 సత్తా చాటింది.

11 గంటల క్రితం