
వేసవి విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు భారత్ సిద్ధం!
మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడినప్పటికీ, ఈ వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలమని భారత్ ధీమా వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ద్రవీకృత సహజ వాయువు (LNG) ధరలు పెరగడం లేదా సరఫరా తగ్గడం వంటి "గ్యాస్ షాక్" ఎదురైనా, మన దేశం ప్రధానంగా దేశీయ బొగ్గు నిల్వలు వేగంగా విస్తరిస్తున్న పునరుత్పాదక ఇంధన వనరులపై (సౌర, పవన శక్తి) ఆధారపడటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. వేసవిలో గరిష్ట విద్యుత్ వినియోగం సమయంలో అంతరాయాలు కలగకుండా ఉండేందుకు, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని ,థర్మల్ ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలను పర్యవేక్షించాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశించింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ముందస్తు ప్రణాళికతో దేశ ఇంధన భద్రతను కాపాడుతూ పౌరులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందించడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది.
సంబంధిత వార్తలు

EC WARNING: సోషల్ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు
ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

హైదరాబాద్ లో వడగండ్ల వాన..బీ అలర్ట్!
హైదరాబాద్ వడగండ్ల వాన కురిసింది. కూకట్‌పల్లి, మూసాపేట్, జేఎన్‌టీయూ , నిజాంపేట్, కేపీహెచ్‌బీకాలనీ, ప్రగతి నగర్ బాచుపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వడగళ్ల వాన పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చే కొన్ని గంటలు ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు... కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

మారథాన్ లో మనుషులను ఓడించిన చైనా రోబోలు
బీజింగ్‌లో జరిగిన ఓ హాఫ్ మారథాన్‌లో హ్యూమనాయిడ్ రోబోలు మానవ అథ్లెట్లను ఓడించాయి. 12,000 మంది మానవ రన్నర్లతో చైనాలో తయారైన వందలాది హ్యూమనాయిడ్ రోబోలు పోటీపడ్డాయి. ఈ రోబోలు వేగంతో పరుగెత్తి, ఏకంగా ప్రపంచ రికార్డును సైతం బద్దలు కొట్టాయి. ఈ అద్భుత ప్రదర్శన, రోబో సాంకేతికతలో జరుగుతున్న వేగవంతమైన పురోగతికి నిదర్శనంగా నిలిచింది.

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.