హైదరాబాద్‌లో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎల్బీ నగర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, బాచుపల్లి , మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడటంతో , ఎండ లతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల అకస్మాత్తుగ ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
సంబంధిత వార్తలు

వడగండ్ల వాన...వరిపంట నష్టం
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురవడంతో వరి పంట దెబ్బ తిన్నది. ఇప్పటికే కోతలు చేపట్టగా, కొద్దిమేర మిగిలిపోయిన పంట వడగండ్ల వానకు పూర్తిగా నేలరాలి చేతికందకుండా పోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు.

రేపే చందనోత్సవం..అప్పన్న నిజరూప దర్శనం!
సింహాచలంలో అక్షయ తృతీయను పురస్కరించుకుని చందనోత్సవం వైభవంగా జరగనుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శనం కోసం దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. ఈ సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ధర్మకర్తల దర్శనం అనంతరం... 3:30నుండి సామాన్య భక్తులను అనుమతి అనుమతిస్తారు. సాయంత్రం 6గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. ఈ ఏడాది సుమారు 2లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

ట్రంప్ ను హెచ్చరించిన ఇరాన్ అధ్యక్షుడు
అణు కార్యక్రమం మరియు హార్ముజ్ జలసంధిపై నియంత్రణ అంశాల్లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ అణు హక్కులను నిరాకరించే అధికారం లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పష్టం చేశారు. యుద్ధాన్ని నివారించేందుకు ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం... ఈ బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

DRONE ACCIDENT: తెలంగాణ MLAకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
TG: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో డ్రోన్ ప్రదర్శన ప్రమాదకరంగా మారింది. వ్యవసాయ అవసరాల కోసం కొనుగోలు చేసిన కొత్త డ్రోన్ పనితీరును పరిశీలిస్తుండగా.. సాంకేతిక లోపంతో అది ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ క్రమంలో డ్రోన్ రెక్కలు తగిలి పరిగి MLA రామ్మోహన్ రెడ్డి కాలికి గాయమైంది. ఆయనతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.