రాజ్యసభలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి పరస్పర గౌరవానికి నిదర్శనంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సహాయం చేశారు. మెట్లపైకి ఎక్కే సమయంలో నడ్డా చేయూత అందించగా, ఆ దృశ్యం వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. విభిన్న పార్టీల నేతల మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని ఈ ఘటన ప్రతిబింబించింది.
సంబంధిత వార్తలు

EC WARNING: సోషల్ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు
ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

రేవంత్ కు విందుపై విమర్శలు..కేంద్రమంత్రి క్లారిటీ
131వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన రేవంత్‌కి...కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విందు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై వర్మ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు తమ శాఖ నుంచి 2,500 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు కోసం ఆమోదం తెలిపామని..వాటిని త్వరగా విడుదల చేయాలని రేవంత్ రెడ్డి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారన్నారు. అలాగనే అల్పాహార విందుకు హాజరయ్యారని స్పష్టం చేశారు.

బెంగాల్ లో ప్రచారం.. మరమరాల మిక్చర్ తిన్న మోడీ
పశ్చిమబెంగాల్ ను గెలిచేందుకు బీజేపీ అన్ని అస్త్రాలు సంధిస్తోంది. మోడీ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. పురూలియా, ఝార్‌గ్రామ్, మేదినీపూర్, బిష్ణుపూర్‌లలో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు . ప్రచారానంతరం ఝూర్‌గ్రామ్‌లోని ఒక చిన్న దుకాణంలో రుచిరకమైన మరమరాలు తింటూ కొద్దిసేపు అక్కడి స్థానికులతో మమేకమయ్యారు. ప్రధాని వారిని నవ్వుతూ పలకరిస్తూ స్నాక్స్‌ను పంచారు.ఆ క్షణాలను ప్రధాని ఎక్స్ లో షేర్ చేశారు.

విజయ్ పార్టీ కోసం తిరుమలలో ప్రచారం..భక్తుల ఆగ్రహం
తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యక్రమాలు , వ్యాఖ్యలు, రీల్చ్ చేయటం తిరుమలలో నిషేధం. అయితే తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు తిరుమలలో ఎన్నికల ప్రచారం నిర్వహించటం విమర్శలకు తావిచ్చింది. నాదనీరాజనం వద్ద టీవీకే పార్టీ సింబల్ అయిన విజిల్ వేస్తూ విజయ్ టీవీకే పార్టీకి ఓటేయాలని ఆ మహిళ కోరుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై భక్తులు మండిపడుతున్నారు.