ఐపీఎల్‌లో ఆర్‌సీబీ వేలం ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు రెండు దిగ్గజ సంస్థలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రేసులో స్వీడన్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ ఒక ప్రధాన పోటీదారుగా నిలిచింది. మరోవైపు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ పాయ్, అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కోల్‌బర్గ్ క్రావిస్ రాబర్ట్స్ & కో, సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ టెమాసెక్ కలిసి ఏర్పాటు చేసిన కన్సార్టియం కూడా గట్టి పోటీ ఇస్తోంది. గతంలో మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమానులైన గ్లేజర్స్, ఆదార్ పూనావాలా వంటి వారు ఆసక్తి చూపినా, చివరికి వారు రేసు నుంచి తప్పుకున్నారు. గ్లేజర్స్ 1.8 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇవ్వగా, ఈక్యూటీ తమ బిడ్‌ను 2 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచినట్టు తెలుస్తోంది. ఆర్‌సీబీ ప్రస్తుత యజమాని డియాజియో గ్రూప్, ఈ డీల్‌ను ఈ నెల 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సంబంధిత వార్తలు

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ
రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఓటమి అంచున ఉన్న జట్టును రింకూ సింగ్ (53*), అనుకుల్ రాయ్ (29*) మెరుపు ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించారు. అంతకుముందు వరుణ్ చక్రవర్తి (3/14) ధాటికి రాజస్థాన్ 155 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఖాతాలో ఇది క్రేజీ విక్టరీ!

టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు
క్రికెట్ స్టార్ ఇషాన్ కిషన్‌ను అచ్చుగుద్దినట్లు ఉన్న వ్యక్తి టీ స్టాల్ వద్ద కనిపించడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఆ వ్యక్తి హావభావాలు, జుట్టు చూసి "ఇషాన్ టీ కొట్టు పెట్టాడా?" అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఐపీఎల్ వేళ ఈ వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

జియోహాట్‌స్టార్ షాక్.. ఈడెన్‌లో ఫ్యాన్స్ ఫైర్
KKR vs RR మ్యాచ్ సందర్భంగా జియోహాట్‌స్టార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లైవ్ స్ట్రీమింగ్ మధ్యలో నిలిచిపోవడం, బఫరింగ్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. కీలక సమయంలో స్ట్రీమింగ్ ఆగిపోవడంతో మ్యాచ్ చూడలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ ఫిర్యాదు చేస్తున్నారు.

జురెల్ ‘మెరుపు’ స్టంపింగ్.. సచిన్ ఫిదా!
కేకేఆర్‌తో పోరులో రాజస్థాన్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత స్టంపింగ్‌తో గ్రీన్‌ను అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గాల్లో డైవ్ చేస్తూ జురెల్ చేసిన ఈ విన్యాసానికి క్రికెట్ లెజెండ్ సచిన్ ప్రశంసలు కురిపించారు. "మెరుపు వేగంతో అద్భుతం చేశావు ధ్రువ్" అంటూ ట్వీట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
