LIVE
Rinku
వెనక్కి
Sports

నాన్న నిన్ను మిస్ అవుతున్నా...రింకూసింగ్ ఎమోషనల్

40 రోజుల క్రితం
సారాంశం

టీమిండియా చారిత్రక విజయం తర్వాత తన దివంగత తండ్రి ఖంచంద్ సింగ్‌ను గుర్తుచేసుకుంటూ...రింకూసింగ్ పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ అందరి హృదయాలను కదిలిస్తోంది. తన తండ్రి లేకుండా ఈ విజయం అసంపూర్ణంగా అనిపిస్తోందని రింకూ ఆవేదన వ్యక్తం చేశాడు. మీతో మాట్లాడకుండా ఇన్ని రోజులు నేనెప్పుడూ గడపలేదు. మీరు లేకుండా జీవితం ఎలా ముందుకు సాగుతుందో నాకు తెలియడం లేదు. కానీ, నా ప్రతి అడుగులో మీ అవసరం ఉంటుందని నాకు తెలుసు. కర్తవ్యమే ప్రథమం అని మీరు ఎప్పుడూ నాకు నేర్పించారు. అందుకే మైదానంలో మీ కలను నెరవేర్చేందుకే ప్రయత్నించాను. ఇప్పుడు మీ కల నెరవేరింది. కానీ, ఈ సంతోష సమయంలో మీరు నాతో ఉండుంటే బాగుండేది. ప్రతి చిన్న, పెద్ద ఆనందంలోనూ మీరు లేని లోటు నాకు తెలుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను పాపా అని రింకూ పేర్కొన్నాడు.

షేర్ చేయండి:
10 మార్చి, 2026 03:43 PMకి

సంబంధిత వార్తలు

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ

రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఓటమి అంచున ఉన్న జట్టును రింకూ సింగ్ (53*), అనుకుల్ రాయ్ (29*) మెరుపు ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించారు. అంతకుముందు వరుణ్ చక్రవర్తి (3/14) ధాటికి రాజస్థాన్ 155 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఖాతాలో ఇది క్రేజీ విక్టరీ!

7 గంటల క్రితం
టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు

టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు

క్రికెట్ స్టార్ ఇషాన్ కిషన్‌ను అచ్చుగుద్దినట్లు ఉన్న వ్యక్తి టీ స్టాల్ వద్ద కనిపించడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఆ వ్యక్తి హావభావాలు, జుట్టు చూసి "ఇషాన్ టీ కొట్టు పెట్టాడా?" అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఐపీఎల్ వేళ ఈ వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

7 గంటల క్రితం
జియోహాట్‌స్టార్ షాక్.. ఈడెన్‌లో ఫ్యాన్స్ ఫైర్

జియోహాట్‌స్టార్ షాక్.. ఈడెన్‌లో ఫ్యాన్స్ ఫైర్

KKR vs RR మ్యాచ్ సందర్భంగా జియోహాట్‌స్టార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లైవ్ స్ట్రీమింగ్ మధ్యలో నిలిచిపోవడం, బఫరింగ్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. కీలక సమయంలో స్ట్రీమింగ్ ఆగిపోవడంతో మ్యాచ్ చూడలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ ఫిర్యాదు చేస్తున్నారు.

7 గంటల క్రితం
జురెల్ ‘మెరుపు’ స్టంపింగ్.. సచిన్ ఫిదా!

జురెల్ ‘మెరుపు’ స్టంపింగ్.. సచిన్ ఫిదా!

కేకేఆర్‌తో పోరులో రాజస్థాన్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత స్టంపింగ్‌తో గ్రీన్‌ను అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గాల్లో డైవ్ చేస్తూ జురెల్ చేసిన ఈ విన్యాసానికి క్రికెట్ లెజెండ్ సచిన్ ప్రశంసలు కురిపించారు. "మెరుపు వేగంతో అద్భుతం చేశావు ధ్రువ్" అంటూ ట్వీట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

7 గంటల క్రితం