ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్థాన్, పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న కేకేఆర్‌పై భారీ స్కోరు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది.
సంబంధిత వార్తలు

కేకేఆర్ స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ విలవిల..
ఈడెన్ గార్డెన్స్‌లో KKR బౌలర్లు RRను కట్టడి చేశారు. వరుణ్ చక్రవర్తి (3 వికెట్లు), సునీల్ నరైన్ మాయాజాలంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు వైభవ్ (46), జైస్వాల్ (39) మెరుపు ఆరంభాన్నిచ్చినా, మధ్య ఓవర్లలో కేకేఆర్ స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో కేకేఆర్ ముందు 156 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.

పంజాబ్ ‘పంజా’.. లక్నోకు సవాల్!
ఐపీఎల్ 2026లో 4 విజయాలతో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ నేడు లక్నోతో తలపడుతోంది. శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్ భారీ ఫామ్‌లో ఉండటం పంజాబ్‌కు కొండంత అండ. అయితే, పంత్ సేన పుంజుకోవాలని చూస్తుండటంతో చండీగఢ్ వేదికగా నేడు హోరాహోరీ పోరు ఖాయం. టాస్ గెలిచిన జట్టుకు చేజింగ్ కలిసొచ్చే అవకాశం ఉంది. పంజాబ్ ఐదో విజయం సాధిస్తుందో లేదో చూడాలి!

వరుణ్ చక్రవర్తి 'మాయాజాలం'.. కేకేఆర్ స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ వికెట్లు!
వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్‌తో RR బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కీలక సమయంలో విజృంభించిన వరుణ్, వరుస విరామాల్లో 3 వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌ను భారీ దెబ్బ తీశాడు. ప్రమాదకరంగా మారుతున్న వైభవ్ సూర్యవంశీ(46), ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ వికెట్ తీసి కేకేఆర్‌ను రేసులోకి తెచ్చాడు. వరుణ్ వేస్తున్న గూగ్లీలను అర్థం చేసుకోలేక రాజస్థాన్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నారు.

నిజం ఏంటి?: ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌పై సీఎస్‌కే ఫిర్యాదు చేసిందా?
SRH తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత, SRH అభిమానులు 'చేతబడి' చేశారంటూ సీఎస్‌కే మేనేజ్‌మెంట్ బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక లేఖ వైరల్ అవుతోంది. అయితే, ఇది పూర్తిగా నకిలీ వార్త అని తేలింది. గతంలో ఆర్‌సీబీ డీజేపై సీఎస్‌కే ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే అయినా, ఈ బ్లాక్ మ్యాజిక్ వార్త మాత్రం కేవలం పుకారు మాత్రమే.
