LIVE
ఇరాన్ ద్విముఖ వ్యూహం..
వెనక్కి

ఇరాన్ ద్విముఖ వ్యూహం..

47 రోజుల క్రితం
సారాంశం

ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయినా (ఉదాహరణకు అమెరికా ‘పేట్రియాట్’ లేదా ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’) ఒకేసారి పరిమిత సంఖ్యలో వచ్చే ముప్పులను మాత్రమే అడ్డుకోగలదు. ఇరాన్ ఇక్కడ ‘క్వాంటిటీ గేమ్’ ఆడుతున్నది. అంటే ఒకే లక్ష్యంపైకి వందలాది చౌకైన ‘షాహెద్’ డ్రోన్లను ఒకేసారి ప్రయోగించడం. దీనివల్ల రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను గుర్తించి కూల్చే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు, వాటి రాడార్లు, కంప్యూటర్లు ‘ఓవర్ లోడ్’ అవుతాయి. అంటే శత్రువు రక్షణ కవచం ఒకేసారి వందల కొద్దీ లక్ష్యాలను చూసి గందరగోళానికి గురవుతుంది. ఈ గ్యాప్‌లోనే ఇరాన్ తన అత్యంత ఖరీదైన బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగిస్తున్నది. వంద డ్రోన్లలో పదిని కూల్చినా, మిగిలినవి రక్షణ కవచానికి చిల్లులు పెట్టి లోపలికి దూసుకుపోతున్నాయి.

షేర్ చేయండి:
3 మార్చి, 2026 02:36 PMకి