సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. వెంకటగిరి చీరలో ఆమె చూపించిన హొయలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఫోటోలే కాకుండా, ఆ చీర వెనుక ఉన్న గొప్ప కథను కూడా ఆమె వివరించడం విశేషం. వెంకటగిరి నేత కార్మికులు ఎంతో నైపుణ్యంతో నేసారు. ఇది తరతరాల కళా నైపుణ్యానికి ప్రతీక. 'ఖుషి' తర్వాత సమంత రెండేళ్ల విరామం అనంతరం 'మా ఇంటి బంగారం' తో అలరించబోతోంది.
సంబంధిత వార్తలు

గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి హైదరాబాద్‌లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యారు. ఎడిటర్‌గా మధు రెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది.

పనన్ కోసం అల్లు అర్జున్ ట్వీట్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నాను. మీరు మళ్లీ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆశిస్తున్నాను’ అంటూ బన్నీ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

"మాఫియా క్వీన్స్ ఆఫ్ ఇండియా"తో వర్మ హల్చల్...
క్రైమ్, మాఫియా కథలంటే పడిచచ్చే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముంబైలో “మాఫియా క్వీన్స్ ఆఫ్ ఇండియా” పుస్తకాన్ని ఆవిష్కరించారు. హుస్సేన్ జైదీ ఈ పుస్తకాన్ని రాశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, మాఫియా కథల్లో మహిళలను కేంద్రంగా చూపించడం చాలా ఆసక్తికర కోణమని తెలిపారు. సాధారణంగా అండర్‌వర్‌ల్డ్ కథలు పురుషుల చుట్టూ తిరుగుతాయని, ఈ పుస్తకం ఆ ధోరణిని మార్చిందన్నారు.

భారతీరాజాను కలిసి రాధిక ఎమోషనల్!
క్లాసిక్ చిత్రాల దర్శకుడు భారతీరాజా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కోలుకుంటున్న తన గురువును చూసి రాధిక భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా రాధిక నటించిన తాజా చిత్రం 'తాయ్ కిళవి'పై భారతీరాజా ప్రశంసలు కురిపించారు. ఆమె అద్భుత నటనకు , కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని ఆయన ఆకాంక్షించారు. ,"మీ ఆశీర్వాదమే నాకు పెద్ద అవార్డు" అంటూ సోషల్ మీడియాలో రాధిక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
