లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు తీసుకువచ్చి, 2029 ఎన్నికల నుంచి అమలు చేయాలని యోచిస్తోంది. దీంతో లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి, దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కి పెరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 263కి చేరనున్నాయి. లోక్‌సభ సీట్లు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ అమలు కోసం ముందుగా సంబంధిత చట్టాలకు సవరణలు చేయనున్నారు. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పునర్విభజన పూర్తి చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా అనుపాతంగా పెరగనున్నాయి.
సంబంధిత వార్తలు

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.

చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వేద పండితులు స్వామివారి ఆశీస్సులు అందించారు. శ్రీవారి విగ్రహాన్ని జేఈవో వెంకయ్య చౌదరి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.
.png)
చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, "శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘకాలం వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
.png)
ప్రజల మధ్యే బాబు పుట్టినరోజు
పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన, ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. నారా భువనేశ్వరి గారు రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచితంగా ఆహారం అందించేందుకు రూ. 76 లక్షల విరాళాన్ని అందజేశారు.