LIVE
GOVERNOR SHIVA PRASAD SHUKLA
వెనక్కి

అంచెలంచెలుగా ఎదిగిన నేత గవర్నర్‌ శివ్ ప్రతాప్ శుక్లా

40 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

లంగాణ నూతన గవర్నర్‌ శివ్ ప్రతాప్ శుక్లా 73 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన నేత. శివ ప్రతాప్ శుక్ల 1952 ఏప్రిల్ 1వ తేదీన ఉత్తర ప్రదేశ్ గోరఖ్ పూర్‌లోని రుద్రపూర్ గ్రామంలో జన్మించారు. న్యాయశాస్త్రంలో పట్టా (LLB)పొందారు. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో ఆయన చురుకుగా పనిచేశారు. ఆ తర్వాత 1983లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు సైతం వెళ్లారు. 1989లో గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యూపీలో కల్యాణ్ సింగ్, రామ్‌ప్రకాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్ ప్రభుత్వాలలో క్యాబినెట్ మంత్రిగా జైళ్లు, న్యాయం, గ్రామీణాభివృద్ధి శాఖలను నిర్వహించారు. అనంతరం 2016లో రాజ్యసభకు ఎన్నికై, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా సేవలు అందించారు. 2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా తెలంగాణకు విచ్చేశారు.

షేర్ చేయండి:
11 మార్చి, 2026 04:26 PMకి