లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. లాహోర్ నగరంలో జరిగిన ఈ దాడిలో హమ్జా తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. గతంలో జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన, ఇప్పుడు జరిగిన ఈ కాల్పులతో మృత్యువుతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు
.png)
ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి.. విమానాలే ఎగరవు
ఉత్తరప్రదేశ్‌లో ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచేందుకు నిర్మించిన కొత్త విమానాశ్రయాలు వెలవెలబోతున్నాయి. ఆర్భాటంగా ప్రారంభించిన కొన్ని నెలలకే సర్వీసులు నిలిచిపోవడంతో రన్ వేలు ఖాళీగా కనిపిస్తున్నాయి. విమాన సంస్థలకు లాభాలు రాకపోవడం, ప్రయాణికుల రద్దీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

RED SALUTE: ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలకు 45 ఏండ్లు!
ADB జిల్లా ఇంద్రవెల్లి పోలీసు కాల్పులకు నేటితో 45 ఏళ్లు నిండాయి. భూమి, అటవీ హక్కుల సాధన కోసం 1981 ఏప్రిల్ 20న గిరిజనులు సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవ కాల్పులకు దారితీయగా 300 మందికి పైగా అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోగా, అధికారులు 13 మంది చనిపోయారని చెప్పారు. హక్కుల కోసం అసువులుబాసిన ఆ వీరులకు ఏటా ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తారు.
-1.png)
ఎన్‌జీవో ముసుగులో దారుణాలు.. మహిళలపై వేధింపులు
నాగ్‌పూర్‌లో ఎన్‌జీవో ముసుగులో మత మార్పిడిలకు పాల్పడుతున్న రియాజ్ కాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సంస్థలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించాలని, మతం మారాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏటీఎస్ లోతుగా విచారణ చేస్తోంది.

KALESWARAM CASE : 22న హైకోర్టు తీర్పు… ADVCతో హరీష్ భేటీ
మాజీ మంత్రి హరీష్ రావు.. న్యాయ నిపుణులను, న్యాయవాదులతో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కేసీఆర్, హరీష్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఏప్రిల్ 22న తన తీర్పును వెలువరించనుంది. కేసీఆర్, హరీష్‌లు కాళేశ్వరంపై పీసీ ఘోస్ కమిషన్ నివేదికను కోర్టులో సవాలు చేశారు.