సారాంశం
టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కాసుల వర్షం కురిపించింది కంపెనీ. ఆయన పనితీరుకు మెచ్చిన గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ , రాబోయే మూడేళ్ల కోసం ఏకంగా 692 మిలియన్ డాలర్ల భారీ శాలరీ ప్యాకేజీని ప్రకటించింది. అంటే భారత కరెన్సీలో అక్షరాలా 6,361కోట్లు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓలలో ఒకరిగా పిచాయ్ నిలవనున్నారు. కేవలం నగదు రూపంలోనే కాకుండా, కంపెనీ షేర్ల రూపంలో ఈ భారీ ప్యాకేజీని గూగుల్ సిద్ధం చేసింది.
7 మార్చి, 2026 02:24 PMకి