భారత జట్టు జూన్ 2026లో ఐర్లాండ్‌లో పర్యటించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా బెల్ఫాస్ట్ వేదికగా జూన్ 26 మరియు 28 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దాదాపు 19 ఏళ్ల తర్వాత భారత జట్టు బెల్ఫాస్ట్‌లో మ్యాచ్ ఆడబోతుండటం విశేషం. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ సిరీస్ ప్రారంభం కానుంది, ఇది యువ ఆటగాళ్లకు మంచి అవకాశంగా మారనుంది.
సంబంధిత వార్తలు

సిజిన్ షిప్ కు నో చెప్పిన రషీద్
తనకు భారత్, ఆస్ట్రేలియా నుంచి సిటిజిన్ షిప్ ఆఫర్స్ వచ్చాయని అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వెల్లడించాడు. కానీ నేను నా దేశం తరఫున మాత్రమే ఆడాలని అనుకుంటున్నానని చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నప్పుడు బీసీసీఐకు చెందిన ఓ అధికారి భారత్ లోనే జీవించండి. క్రికెట్ ఆడండని ఆఫర్ చేశారు. కానీ నా సొంత దేశానికి మాత్రమే ఆడాలనుకుంటున్నానని చెప్పానని రషీద్ చెప్పుకొచ్చాడు.
ఆ క్రికెటర్ కే నా బ్యాట్ బహుమతి: శ్రేయస్
పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటర్లకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భలే ఆఫర్ ఇచ్చాడు. ఈ IPL సీజన్ లో అత్యధిక సిక్స్ లు ఎవరు కొడతారో వారికి తన బ్యాట్ ను గిఫ్టిగ్ ఇస్తానని చెప్పాడు. లక్నోపై భారీ విజయం తర్వాత శ్రేయస్ మాట్లాడుతూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రియాంశ్ ఆర్యపై ప్రశంసలు కురిపించాడు. సిక్సర్ల గురించి జట్టు సమావేశాల్లో చర్చింకుంటామని, ఎవరైతే ఎక్కువ సిక్స్ లు కొడతారో వారికి తన బ్యాట్ గిఫ్టుగా ఇస్తానన్నాడు.

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ క్రేజీ విక్టరీ
రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఓటమి అంచున ఉన్న జట్టును రింకూ సింగ్ (53*), అనుకుల్ రాయ్ (29*) మెరుపు ఇన్నింగ్స్‌లతో గట్టెక్కించారు. అంతకుముందు వరుణ్ చక్రవర్తి (3/14) ధాటికి రాజస్థాన్ 155 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఖాతాలో ఇది క్రేజీ విక్టరీ!

టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు
క్రికెట్ స్టార్ ఇషాన్ కిషన్‌ను అచ్చుగుద్దినట్లు ఉన్న వ్యక్తి టీ స్టాల్ వద్ద కనిపించడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఆ వ్యక్తి హావభావాలు, జుట్టు చూసి "ఇషాన్ టీ కొట్టు పెట్టాడా?" అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఐపీఎల్ వేళ ఈ వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది.
