
టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ వ్యాప్తంగా టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, జిల్లా మరియు సిటీల స్థాయిల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కేంద్రాల ద్వారా నిరుద్యోగులు మరియు ఔత్సాహికులు స్వయం ఉపాధి పొందేందుకు మంచి అవకాశం కల్పిస్తున్నారు. అందరికీ వివిధ రకాల డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కేంద్రాల ద్వారా కొత్త పాన్ కార్డుల దరఖాస్తు, కరెక్షన్, బస్సు, ట్రైన్, విమాన టికెట్ల బుకింగ్ వంటి సేవలు అందించవచ్చు. అలాగే బ్యాంకింగ్ మనీ ట్రాన్స్‌ఫర్, ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టం, మైక్రో ఏటీఎం సేవలు, క్యాష్ డిపాజిట్లు అందుబాటులో ఉంటాయి. హెల్త్, బైక్ మరియు కార్ ఇన్సూరెన్స్ వంటి బీమా సేవలతో పాటు వివిధ రకాల బిల్లుల చెల్లింపులు కూడా చేయవచ్చు.
సంబంధిత వార్తలు

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్
ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్‌గా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు.

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ
విష్ణు ప్రియ ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంలో నటి అనన్య నాగళ్లపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. వాటికి ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ ఫీచర్ గురించి, దీంతో కలిగే ప్రయోజనాల గురించి తాను 2025లోనే క్లారిటీ ఇచ్చానని అనన్య గుర్తు చేశారు. అసలు విషయం తెలుసుకోకుండా కేవలం విమర్శల కోసమే కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పుష్ప 2 బాహుబలి 2. మధ్యలో...?
భారీ వసూళ్ల రికార్డులు సాధించిన సినిమాల్లో పుష్ప 2, బాహుబలి 2కి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రెండు సినిమాలు చాలా కాలంగా టాప్ గ్రాసర్స్ జాబితాలో రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ స్థానాలను కదిలించేలా బాలీవుడ్ స్పై థ్రిల్లర్ దురంధర్-2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గతేడాది విడుదలైన పుష్ప 2 వసూళ్లను అధిగమిస్తూ తాజాగా దురంధర్-2 సత్తా చాటింది.