LIVE
TELANGANA GOVERNOR
వెనక్కి

తెలుగులో ప్రమాణం చేసిన కొత్త గవర్నర్ శుక్లా

40 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తెలుగులో ప్రమాణం చేయడం ఆసక్తిగా మారింది. లోక్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హాజరయ్యారు. ముందుగా వందేమాతరం పూర్తి గేయంతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శుక్లాకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. 2023-2026 మధ్య హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా తెలంగాణకు విచ్చేశారు.

షేర్ చేయండి:
11 మార్చి, 2026 03:56 PMకి