సారాంశం
ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల మొదటి వారంలోనే భానుడు భగభగమండిపోతున్నాడు. సాధారణంగా మార్చి రెండో వారం తర్వాత ఎండలు పెరుగుతాయి. కానీ ఈసారి తొలి వారంలోనే వేడి తీవ్రత మొదలైంది. ఈ వారంలో సగటు ఉష్ణోగ్రతలు 1 నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని అధికారులు సూచించారు. ఇక నేడు ఆరు జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
6 మార్చి, 2026 01:06 PMకి