శ్రీతుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవాలకు ఏర్పాట్లు..వారికి నో ఎంట్రీ
శ్రీతుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. ఈ నెల 31, ఏప్రిల్ 1 తేదీల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై తిరుమల పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. భక్తుల భద్రత దృష్ట్యా తెల్లవారు జామున 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. తుంబురు తీర్థానికి చాలా దూరం నడవాల్సి ఉండటంతో వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలు, దీర్ఘవ్యాధిగ్రస్తులు, గుండె- శ్వాస కోస సంబంధిత సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు.
సంబంధిత వార్తలు
76వ వసంతంలోకి అడుగు పెట్టిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. సమకాలీన రాజకీయ ప్రపంచంలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, ప్రజలు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. 76 ఏళ్ళ వయస్సులోనూ అలుపెరుగ కుండా పని చేస్తున్న చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
ఉదయం 5 గం. నుంచే మెట్రో రైల్ సర్వీసులు..?
హైదరాబాద్‌లో మెట్రో సేవల సమయాలు త్వరలో మారే అవకాశం ఉంది . ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్న మెట్రోను 5 గంటల నుంచే నడపాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ కు సీఎస్ రామకృష్ణారావు విజ్ఞప్తి చేశారు. తెల్లవారు జామునే సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లకు చేరే రైళ్ళతో పాటు ,వందేభారత్, రాజధాని, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ల కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. టైమింగ్స్ మార్చాలని లేఖ రాశారు.
ఇవాళ మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి
మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పరిశీలించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహ దేవ్‌పూర్ వద్ద గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీ రెండున్నరేళ్ల క్రితం కుంగిపోవడంతో పునరుద్ధరణ పనులు కొనసాగుతు న్నాయి. బోర్ డ్రిల్లింగ్ సహా జరుగుతున్న పనులను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. NDSA మార్గదర్శకాల మేరకు చర్యలు వేగవంతం చేయాలని ఇప్పటికే ఆదేశించారు. అనంతరం సీఎం సమీక్ష నిర్వహిస్తారు.
తిరుమల: శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కలకలం
శ్రీవారిమెట్టు మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. శేషాచల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత సరస్వతీ మండపం వద్ద తిరుగుతుండగా కాలినడక భక్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది చేరుకుని చెట్టు కొమ్మపై ఉన్న చిరుతను చూశారు. సిబ్బంది హడావుడి చేయడంతో అది అడవిలోకి జారుకుంది. భక్తులను అప్రమత్తం చేసిన అధికారులు గుంపులుగా ప్రయాణించాలంటూ సూచించారు.