ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) శనివారం నాడు జరగబోయే అస్సాం అసెంబ్లీ ఎన్నికల కోసం తమ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల నుండి 17 మంది అభ్యర్థుల పేర్లను ఈ జాబితాలో చేర్చింది. ఈ అభ్యర్థులలో కోక్రాఝర్‌లోని బావఖుంగ్రి నుండి ఉడంగ్‌శ్రీ నర్సరీ, ధుబ్రిలోని బిలాసిపారా నుండి మోమినూర్ ఇస్లాం, గోల్‌పారాలోని జలేశ్వర్ నుండి ఆరిఫ్ అక్తర్ అహ్మద్, మరియు బోంగైగావ్‌లోని అభయపురి నుండి కౌశిక్ రంజన్ దాస్ ఉన్నారు. ఇతర పేర్లలో కళ్యాణి కలిత (బజాలి), దులు అహ్మద్ (చమారియా), భోగియల్ రాభా (బోకో-చాయ్‌గావ్ ఎస్టీ), బికాష్ నాథ్ యోగి (పలాస్‌బారి), మరియు అమీరుల్ ఇస్లాం (బర్ఖేత్రి) తదితరులు ఉన్నారు.
సంబంధిత వార్తలు

EC WARNING: సోషల్ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు
ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి
రాష్ట్రాభివృద్ధిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని నేతలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వ సేవల వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేశారు.

JAGITYAALA JUNG : జగిత్యాలలో ఉద్రిక్తత.. ఫ్లెక్సీలు ధ్వంసం
జగిత్యాలలో ఉద్రక్తిత పరిస్థితులు నెలకొన్నాయి. రేపు కేసీఆర్ భారీ బహిరంగ సభ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదంగా మారాయి. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం ఏర్పాటు చేసుకున్న జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను సంజయ్ వర్గం చింపింది. దీంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఓ పిక్ పాకెటర్: కేంద్రమంత్రి
కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. CM రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో కేవలం గాంధీ కుటుంబానికే ప్రాధాన్యత ఉంటుందని, అది వారసత్వ రాజకీయాలకు నిలయమని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవడం ద్వారా ఇండీ కూటమి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
