అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫార్మా రంగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని పేటెంట్ ఔషధాలపై భారీ సుంకాలు విధించే ఫైలుపై సంతకం చేశారు. * కొన్నిరకాల పేటెంట్ ఔషధాలపై 100% వరకు టారిఫ్ * ఒప్పందం లేని కంపెనీలకు సైతం సుంకాలు వర్తిస్తాయని స్పష్టం * మొదట 20% నుంచి ప్రారంభించి నాలుగేళ్లలో 100% వరకు పెంపు * అమెరికాలో ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేస్తే సుంకాల మినహాయింపు * కంపెనీలకు చర్చల కోసం 120 నుంచి 180 రోజుల గడువు
సంబంధిత వార్తలు
అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది చిన్నారులు బలి
అమెరికాలోని లూసియానాలో కాల్పుల కలకలం రేగింది. రద్దీ ప్రాంతంలో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో 8 మంది పిల్లలు మృతి చెందారు. మృతుల వయసు 1 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్నట్లు ష్రీవ్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం నిందితుడు కారు దొంగిలించి పారిపోవడానికి యత్నించగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్టు తెలిపారు.
మలి విడత చర్చలకు రెడీ అవుతున్న ఇరాన్, అమెరికా
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పాకిస్థాన్ లో మలి విడత చర్చలకు రంగం సిద్ధం అవుతోంది. ట్రంప్ రెచ్చ గొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చల ప్రక్రియపై అందరి దృష్టీ కేంద్రీకృతం అయి ఉంది. అమెరికా ప్రతినిధులు సోమవారం పాక్ చేరుకుంటారని భావిస్తున్నారు. ఇరాన్ ప్రతినిధుల రాకపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే.. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అంగీకరించక పోతే భారీ వినాశనం తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు.
.jpg)
ఇరాన్‌కు అమెరికా చుక్కలు: ప్రపంచవ్యాప్తంగా నౌకల సీజ్..
హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు అమెరికా ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకలు ,చమురు ట్యాంకర్లు కనిపిస్తే వాటిని సీజ్ చేయాలని పెంటగాన్ యోచిస్తోంది. ఇరాన్ పోర్టులను ఇప్పటికే దిగ్బంధించిన అమెరికా, హర్మూజ్ వద్ద 23 నౌకలను అడ్డుకుని తనిఖీలు చేపట్టింది.ఈ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదంఉంది.

ఇంతకీ హార్మూజ్ ఓపెన్ కాలేదా..??
హార్మూజ్ జల సంధి ఓపెన్ అయ్యింది అని అమెరికా చెబుతున్నప్పటికీ, ప్రపంచ దేశాలు పూర్తిగా నమ్మడం లేదు. అక్కడినుంచి ప్రయాణిస్తున్న కమర్షియల్ నౌకలు చాలా జాగ్రత్తగా కదులుతున్నట్లు తెలుస్తోంది. సముద్ర గర్భంలో సీ మైన్స్. ప్రమాదం దృష్ట్యా ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటున్నారు. అందుచేత పూర్తిగా ట్రాఫిక్ ఊపందుకునేందుకు సమయం పట్టేటట్లుంది.
