LIVE
యుద్ధంలో చిన్నారుల మృతిపై యూనిసెఫ్ ఆందోళన
వెనక్కి

యుద్ధంలో చిన్నారుల మృతిపై యూనిసెఫ్ ఆందోళన

44 రోజుల క్రితం
సారాంశం

యుద్ధంలో ఎంతో మంది చిన్నారులు చిధ్రమైపోతున్నారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దాడుల కారణంగా పశ్చిమాసియాలో వందల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. గత నెల 28న ప్రారంభమైన యుద్ధం నేటితో ఏడవ రోజుకు చేరుకున్నది. ఈ యుద్ధంలో అత్యధికంగా ఇరాన్‌లో చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. ఇరాన్‌లో 181 మంది, లెబనాన్‌లో ఏడుగురు, ఇజ్రాయెల్‌లో ముగ్గురు, కువైట్‌లో ఒకరు మృతి చెందినట్లు వెల్లడించింది. యుద్ధాలను పిల్లలు ప్రారంభించరని కానీ వారు కూడా మూల్యం చెల్లించుకుంటున్నారని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ఆవేదన వ్యక్తం చేసింది.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 02:53 PMకి