LIVE
20260310fr69aff0c3a225d
వెనక్కి
Entertainment

ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ పూర్తి

40 రోజుల క్రితం
సారాంశం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ఈ మూవీకి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 29 నిమిషాలుగా ఖరారైంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది ఉస్తాద్ భగత్ సింగ్. ఇదే రోజున రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొంది.

షేర్ చేయండి:
10 మార్చి, 2026 04:17 PMకి

సంబంధిత వార్తలు

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.

11 గంటల క్రితం
మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్‌గా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు.

11 గంటల క్రితం
ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ

విష్ణు ప్రియ ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంలో నటి అనన్య నాగళ్లపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్‌ వస్తున్నాయి. వాటికి ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ ఫీచర్ గురించి, దీంతో కలిగే ప్రయోజనాల గురించి తాను 2025లోనే క్లారిటీ ఇచ్చానని అనన్య గుర్తు చేశారు. అసలు విషయం తెలుసుకోకుండా కేవలం విమర్శల కోసమే కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

12 గంటల క్రితం
పుష్ప 2 బాహుబలి 2. మధ్యలో...?

పుష్ప 2 బాహుబలి 2. మధ్యలో...?

భారీ వసూళ్ల రికార్డులు సాధించిన సినిమాల్లో పుష్ప 2, బాహుబలి 2కి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రెండు సినిమాలు చాలా కాలంగా టాప్ గ్రాసర్స్ జాబితాలో రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ స్థానాలను కదిలించేలా బాలీవుడ్ స్పై థ్రిల్లర్ దురంధర్-2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గతేడాది విడుదలైన పుష్ప 2 వసూళ్లను అధిగమిస్తూ తాజాగా దురంధర్-2 సత్తా చాటింది.

12 గంటల క్రితం