వల్లభనేని వంశీ కంప్లైంట్..ఆ ఛానెళ్లకు లీగల్ నోటీసులు..?
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీ పేర్ని నానితో కలిసి మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీని కలిశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబ్ ఛానెళ్లకు తన తరపు న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపినట్లు వంశీ వెల్లడించారు.
సంబంధిత వార్తలు

భువనేశ్వరి గురించి చంద్రబాబు ఏమన్నారో తెలుసా..!!
పుట్టినరోజు సందర్భంగా భార్య భువనేశ్వరి తో కలిసి సీఎం చంద్రబాబు కేక్ కట్ చేశారు. అద్భుతమైన జీవిత భాగస్వామి అని అభివర్ణించారు. నిరంతరాయంగా ఆమె ఇచ్చే మద్దతు, తన జీవితాన్ని అర్థవంతంగా మార్చింది అని ప్రశంసలు కురిపించారు.

RED SALUTE: ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలకు 45 ఏండ్లు!
ADB జిల్లా ఇంద్రవెల్లి పోలీసు కాల్పులకు నేటితో 45 ఏళ్లు నిండాయి. భూమి, అటవీ హక్కుల సాధన కోసం 1981 ఏప్రిల్ 20న గిరిజనులు సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవ కాల్పులకు దారితీయగా 300 మందికి పైగా అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోగా, అధికారులు 13 మంది చనిపోయారని చెప్పారు. హక్కుల కోసం అసువులుబాసిన ఆ వీరులకు ఏటా ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తారు.
-1.png)
ఎన్‌జీవో ముసుగులో దారుణాలు.. మహిళలపై వేధింపులు
నాగ్‌పూర్‌లో ఎన్‌జీవో ముసుగులో మత మార్పిడిలకు పాల్పడుతున్న రియాజ్ కాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సంస్థలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు, ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించాలని, మతం మారాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏటీఎస్ లోతుగా విచారణ చేస్తోంది.

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.