LIVE
VASIREDDY PADMA
వెనక్కి

జగన్ పాలనపై వాసిరెడ్డి పద్మ ఫైర్

40 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పేందుకు జగన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి పాలన స్వర్ణయుగం కాదు.. రాక్షస యుగం అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో కాగ్ ఇచ్చిన నివేదికను కూడా జగన్ రెడ్డి చదివి వినిపించాలని డిమాండ్ చేశారు. అప్పులపై లేఖలు రాయడం కాదని.. రైతు సమస్యల పరిష్కారం కోసం కేంద్రానికి లేఖలు రాయాలని పద్మ సూచించారు. మహిళలపై వైసీపీ నేతలు వేధింపులు చేసినప్పుడు చర్యలు తీసుకోని జగన్‌కు.. నేడు మహిళల రక్షణ గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు.

షేర్ చేయండి:
11 మార్చి, 2026 04:42 PMకి