సారాంశం
టీవీకే అధినేత, దళపతి విజయ్ విడాకుల వివాదం ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. విజయ్‌కు ఆయన భార్య సంగీత నుంచి మరో కొత్త షాక్ తగిలింది. వీరిద్దరి మధ్య జరుగుతున్న విడాకుల వివాదంలో తాజాగా ఆమె చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఒక కీలక పిటిషన్‌ను దాఖలు చేసింది. విడాకుల కేసు విచారణ పూర్తయ్యే వరకు చెన్నైలోని నీలంకరైలో ఉన్న తమ సొంత నివాసంలోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది. ఒకవేళ విడాకుల ప్రక్రియతో ముందుకు వెళ్తే ఆ ఇంటిని ఖాళీ చేయాలని విజయ్ తరపు న్యాయవాదులు తనను హెచ్చరించారని, అయితే బ్రిటీష్ పౌరసత్వం కలిగిన తనకు చెన్నైలో ప్రత్యామ్నాయ నివాసం లేదని సంగీత పేర్కొన్నారు. విజయ్ హోదాకు తగినట్లుగా తన పిల్లలతో కలిసి ఆ ఇంట్లో నివసించే హక్కు తనకు ఉందని ఆమె తన పిటిషన్‌లో స్పష్టం చేసింది.
7 మార్చి, 2026 02:44 PMకి