LIVE
Screenshot 2026 03 20 160924
వెనక్కి
Politics

ఆస్తులు పంచకుండా జగన్ అన్యాయం చేశాడు: విజయమ్మ

30 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తులపై ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో వైఎస్ఆర్ మరణం వరకున్న ఆస్తులన్నీ సంయుక్త కుటుంబ ఆస్తులేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆస్తుల పంపకం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్ ఉద్దేశం ప్రకారం అన్ని ఆస్తులను నలుగురు మనుమళ్లకు సమానంగా పంచాలని చెప్పారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం చేశారని ఆరోపించారు.

షేర్ చేయండి:
20 మార్చి, 2026 04:07 PMకి

సంబంధిత వార్తలు

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి

రాష్ట్రాభివృద్ధిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని నేతలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వ సేవల వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేశారు.

31 నిమిషాల క్రితం
JAGITYAALA JUNG : జగిత్యాలలో ఉద్రిక్తత.. ఫ్లెక్సీలు ధ్వంసం

JAGITYAALA JUNG : జగిత్యాలలో ఉద్రిక్తత.. ఫ్లెక్సీలు ధ్వంసం

జగిత్యాలలో ఉద్రక్తిత పరిస్థితులు నెలకొన్నాయి. రేపు కేసీఆర్ భారీ బహిరంగ సభ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదంగా మారాయి. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం ఏర్పాటు చేసుకున్న జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను సంజయ్ వర్గం చింపింది. దీంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

45 నిమిషాల క్రితం
సీఎం రేవంత్ రెడ్డి ఓ పిక్ పాకెటర్: కేంద్రమంత్రి

సీఎం రేవంత్ రెడ్డి ఓ పిక్ పాకెటర్: కేంద్రమంత్రి

కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. CM రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో కేవలం గాంధీ కుటుంబానికే ప్రాధాన్యత ఉంటుందని, అది వారసత్వ రాజకీయాలకు నిలయమని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవడం ద్వారా ఇండీ కూటమి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

50 నిమిషాల క్రితం
బీజేపీ,బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధం: ఆది శ్రీనివాస్

బీజేపీ,బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధం: ఆది శ్రీనివాస్

కేటీఆర్, హరీష్ రావులకు ప్రజల సమస్యల కంటే బురద చల్లడమే పనిగా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు.ఇద్దరూ కోడిగుడ్డు మీద ఈకలు పీకే నాయకులని ఫైర్ అయ్యారు. బిఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నాయని, వారిది విడదీయలేని ఫెవికాల్ బంధమని ఆరోపించారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు.

1 గంటల క్రితం