
కూకట్‌పల్లి: అమ్మవారి ఆలయానికి జనసేన నేత ప్రేమ్‌కుమార్ భారీ విరాళం
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ గాయత్రీ నగర్‌లో ఉన్న శ్రీ కనకదుర్గ నాగదేవత సహిత పోచమ్మ దేవాలయ అభివృద్ధికి జనసేన ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ తన వంతుగా భారీ విరాళాన్ని ప్రకటించారు. స్థానిక లలితా గ్రూపు సభ్యులు మరియు జనసేన యువ నేత పవన్ ఆహ్వానం మేరకు ఆయన ఆలయాన్ని సందర్శించి, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రాంగణ ఫ్లోరింగ్ కోసం అవసరమైన సుమారు రూ.6 లక్షలకు పైగా విలువైన గ్రానైట్‌ను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ స్థానికంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్న లలితా గ్రూపు మహిళల్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నేత పవన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

EC WARNING: సోషల్ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు
ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

హైదరాబాద్ లో వడగండ్ల వాన..బీ అలర్ట్!
హైదరాబాద్ వడగండ్ల వాన కురిసింది. కూకట్‌పల్లి, మూసాపేట్, జేఎన్‌టీయూ , నిజాంపేట్, కేపీహెచ్‌బీకాలనీ, ప్రగతి నగర్ బాచుపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వడగళ్ల వాన పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చే కొన్ని గంటలు ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు... కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

మారథాన్ లో మనుషులను ఓడించిన చైనా రోబోలు
బీజింగ్‌లో జరిగిన ఓ హాఫ్ మారథాన్‌లో హ్యూమనాయిడ్ రోబోలు మానవ అథ్లెట్లను ఓడించాయి. 12,000 మంది మానవ రన్నర్లతో చైనాలో తయారైన వందలాది హ్యూమనాయిడ్ రోబోలు పోటీపడ్డాయి. ఈ రోబోలు వేగంతో పరుగెత్తి, ఏకంగా ప్రపంచ రికార్డును సైతం బద్దలు కొట్టాయి. ఈ అద్భుత ప్రదర్శన, రోబో సాంకేతికతలో జరుగుతున్న వేగవంతమైన పురోగతికి నిదర్శనంగా నిలిచింది.

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.