
WAR EFFECT: ఇరాన్ యుద్ధ ప్రభావం: IND సిరామిక్ హబ్‌లో ఉద్యోగాల కోతలు
ఇరాన్–మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావం IND ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. గుజరాత్‌లోని మోర్బి సిరామిక్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. గ్యాస్ సరఫరా అంతరాయంతో సిరామిక్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. లక్షలాది మందికి ఉపాధి కల్పించే మోర్బి ప్రాంతం ప్రపంచంలో రెండవ అతిపెద్ద సిరామిక్ తయారీ కేంద్రం. ప్రస్తుతం వందలాది యూనిట్లు మూతపడటంతో కార్మికులు ఉద్యోగాలు పోయి, తిరిగి వస్తున్నారు.
సంబంధిత వార్తలు

RTC కార్మికులకు గుడ్ న్యూస్: సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు!
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న వేతన సవరణ (PRC), బకాయిల చెల్లింపు, మరియు పని వేళల్లో ఎదురవుతున్న ఇబ్బందులను కూలంకషంగా అధ్యయనం చేయడం ఈ కమిటీ ప్రాథమిక లక్ష్యం.ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆర్టీసీలో త్వరలోనే కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డ్యూటీ చార్ట్‌ల క్రమబద్ధీకరణ మరియు మహిళా కండక్టర్ల భద్రతకు సంబంధించి ప్రత్యేక విధివిధానాలు ఆశించవచ్చు.
ఏపీలో దంచికొట్టిన వడగళ్ల వాన
ఏపీలో పలు జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో వర్షం పడింది. మాడుగుల, బీరం, మొండికోట ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికా , ఇరాన్ మధ్య జరగనున్నశాంతి చర్చల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 753.03 పాయింట్లు లాభపడి 79,273.33 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 211.75 పాయింట్లు లాభపడి 24,576.60 వద్ద ముగిసింది.

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
ఉద్యోగుల సాధారణ బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే మేనెల 1 నుంచి 31 వరకు బదిలీలకు షెడ్యూలు ప్రకటించింది. ఒకే చోట నాలుగేళ్లకు పైగా పని చేస్తున్న ఉద్యోగులను తప్పనిసరి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. జనగణన విధుల్లో ఉన్న వారికి బదిలీల మార్గదర్శకాలు వర్తించవని ప్రభుత్వం తెలిపింది.