
WARNING: ధూపపానం తగ్గించడం కోసం సిగరెట్ రేట్లు పెంచిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో సిగరెట్ ధరలు షాక్ ఇస్తున్నాయి.ఒక్క ప్యాక్ రూ.3,300 పైగా ధర ఉంది. Australia లో సిగరెట్ ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. అక్కడ ఒక్క సిగరెట్ ప్యాక్ ధర $40 కంటే ఎక్కువగా ఉండగా, భారత కరెన్సీలో ఇది సుమారు రూ.3,300–₹3,400 వరకు ఉంటుంది. అధిక పన్నులు, కఠిన నియంత్రణల వల్ల ధూమపానం తగ్గించడంలో ప్రభుత్వం కొంతవరకు విజయవంతమవుతోంది.
సంబంధిత వార్తలు

మారథాన్ లో మనుషులను ఓడించిన చైనా రోబోలు
బీజింగ్‌లో జరిగిన ఓ హాఫ్ మారథాన్‌లో హ్యూమనాయిడ్ రోబోలు మానవ అథ్లెట్లను ఓడించాయి. 12,000 మంది మానవ రన్నర్లతో చైనాలో తయారైన వందలాది హ్యూమనాయిడ్ రోబోలు పోటీపడ్డాయి. ఈ రోబోలు వేగంతో పరుగెత్తి, ఏకంగా ప్రపంచ రికార్డును సైతం బద్దలు కొట్టాయి. ఈ అద్భుత ప్రదర్శన, రోబో సాంకేతికతలో జరుగుతున్న వేగవంతమైన పురోగతికి నిదర్శనంగా నిలిచింది.

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా
నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్
ఇన్‌స్టాలో డబ్బున్న బాలికలను ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు అర్జున్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలను, హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంటోంది ఈ గ్యాంగ్. ఒంటరిగా ఉండే పిల్లల బలహీనతలను ఆసరాగా చేసుకుని...సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వారితో స్నేహం నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు.