LIVE
554848 A
వెనక్కి
Crime

మోసగించిన భార్య!టవర్ ఎక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్!

5 గంటల క్రితం
Telangana, Andhra Pradesh
సారాంశం

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని, నా బిడ్డను నాకు అప్పగించాలని ఎక్సైజ్ కానిస్టేబుల్ శనివారం రామగుండంలో టవర్ ఎక్కి దూకుతానని బెదిరించాడు.తన భార్య ప్రవర్తనపై పూర్తి ఆధారాలు ఉన్నాయని , కుటుంబ పరిస్థితుల దృష్ట్యా, బిడ్డ భవిష్యత్తు కోసం తన దగ్గరే ఉండటం మంచిదని విజ్ఞప్తి చేశాడు. అక్కడికి చేరుకున్న రామగుండం ఎస్సై బాధితునికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి దిగమని చెప్పారు.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 12:08 PMకి

సంబంధిత వార్తలు

BREAKING: టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి

BREAKING: టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కట్టనార్‌పట్టి సమీపంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రసాయనాలు కలుపుతున్న సమయంలో ఘర్షణ జరగడం వల్లే ఈ పేలుడు సంభవించిందని నిర్ధారించారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

29 నిమిషాల క్రితం
ముగ్గురి ప్రాణాలు తీసిన రీల్స్  పిచ్చి..

ముగ్గురి ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి..

రీల్స్ మోజు ముగ్గురు యువకుల ప్రాణాలు బలితీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో పల్సర్ బైకుపై అతివేగంగా వెళ్తూ నాటు తుపాకీతో విన్యాసాలు చేస్తూ వీడియో చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బైక్ ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో బైక్ కూడా ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

37 నిమిషాల క్రితం
మంచిర్యాల జిల్లాలో నాటు బాంబుల కలకలం

మంచిర్యాల జిల్లాలో నాటు బాంబుల కలకలం

మంచిర్యాల జిల్లాలోని జన్నారంలో నాటు బాంబులు పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాదంపల్లి గ్రామ శివారులో గోదావరి నది దగ్గర పశువులు మేస్తుండగా ఈ ఘటన జరిగింది. పొదల్లో దాచిపెట్టిన నాటు బాంబులని పశువులు అనుకోకుండా తొక్కడంతో అవి పేలిపోయాయి. ఒక్కసారిగా వచ్చిన శబ్దానికి స్థానికులు భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ మరికొన్ని నాటు బాంబులు కనిపించాయి.

47 నిమిషాల క్రితం
DANGER : చావుతో ఆట.. రైల్వే స్టేషన్‌లో హైడ్రామా

DANGER : చావుతో ఆట.. రైల్వే స్టేషన్‌లో హైడ్రామా

మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఒక యువకుడు 25 వేల వోల్టుల హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్‌చల్ చేశాడు. ఇది గమనించిన అధికారులు వెంటనే కరెంట్ సరఫరా నిలిపివేసి.. గంటన్నర పాటు శ్రమించి అతడిని సురక్షితంగా కిందికి దించారు. ఈ హైడ్రామా వల్ల మూడు రైళ్ల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆ యువకుడు మానసిక స్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

1 గంటల క్రితం