LIVE
Parlment New
వెనక్కి
PoliticsNational

మహిళా రిజర్వేషన్ బిల్లు..ఎందుకు వీగిపోయిందంటే..!

1 రోజుల క్రితం
Telangana, Andhra Pradesh
సారాంశం

మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన మెజారిటీ కంటే 54 ఓట్లు తక్కువగా రావడంతో వీగిపోయింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై శుక్రవారం సాయంత్రం ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కాగా, కేవలం 298 ఓట్లు మాత్రమే రావడంతో బిల్లు వీగిపోయింది.

షేర్ చేయండి:
18 ఏప్రిల్, 2026 12:13 PMకి

సంబంధిత వార్తలు

జగన్ అందుకే తల్లికి విషెస్ చెప్పలేదా..?

జగన్ అందుకే తల్లికి విషెస్ చెప్పలేదా..?

తన తల్లి జన్మదినంపై జగన్‌ మౌనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైఎస్ విజయలక్ష్మి 70వ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల, లోకేశ్ ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే జగన్ నుంచి ఎలాంటి స్పందన రాక పోవడం గమనార్హం. ఆర్దిక వివాదాల నేపథ్యంలోనే జగన్ తన తల్లి పుట్టిన రోజును పట్టించుకోలేదనే వాదనలు వినిపి స్తున్నాయి. ఇదే సమయంలో శస్త్రచికిత్స అనంతరం పవన్‌కల్యాణ్ త్వరగా కోలుకోవాలని జగన్ ట్వీట్ చేశారు.

3 గంటల క్రితం
EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

EC WARNING: సోషల్‌ మీడియా పోస్టులపై ఈసీ చర్యలు

ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా లో తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 11 వేల సోషల్ మీడియా పోస్టులు, ఇతర కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 23న TN, ఈ నెల 23, 29న రెండు దశల్లో WBలో పోలింగ్ ఉంది.

12 గంటల క్రితం
రేవంత్ కు విందుపై విమర్శలు..కేంద్రమంత్రి క్లారిటీ

రేవంత్ కు విందుపై విమర్శలు..కేంద్రమంత్రి క్లారిటీ

131వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన రేవంత్‌కి...కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విందు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై వర్మ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు తమ శాఖ నుంచి 2,500 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు కోసం ఆమోదం తెలిపామని..వాటిని త్వరగా విడుదల చేయాలని రేవంత్ రెడ్డి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారన్నారు. అలాగనే అల్పాహార విందుకు హాజరయ్యారని స్పష్టం చేశారు.

12 గంటల క్రితం
బెంగాల్ లో ప్రచారం.. మరమరాల మిక్చర్ తిన్న మోడీ

బెంగాల్ లో ప్రచారం.. మరమరాల మిక్చర్ తిన్న మోడీ

పశ్చిమబెంగాల్ ను గెలిచేందుకు బీజేపీ అన్ని అస్త్రాలు సంధిస్తోంది. మోడీ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. పురూలియా, ఝార్‌గ్రామ్, మేదినీపూర్, బిష్ణుపూర్‌లలో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు . ప్రచారానంతరం ఝూర్‌గ్రామ్‌లోని ఒక చిన్న దుకాణంలో రుచిరకమైన మరమరాలు తింటూ కొద్దిసేపు అక్కడి స్థానికులతో మమేకమయ్యారు. ప్రధాని వారిని నవ్వుతూ పలకరిస్తూ స్నాక్స్‌ను పంచారు.ఆ క్షణాలను ప్రధాని ఎక్స్ లో షేర్ చేశారు.

12 గంటల క్రితం