LIVE
ఇరాన్ కు బైడూ నావిగేషన్.. చైనా సాయం
వెనక్కి

ఇరాన్ కు బైడూ నావిగేషన్.. చైనా సాయం

47 రోజుల క్రితం
సారాంశం

ఇరాన్ యుద్ధతంత్రంలో మరో ముఖ్యమైన అంశం బైడూ. ఇది చైనాకు చెందిన ‘బైడూ’ నావిగేషన్ వ్యవస్థ. సాధారణంగా మిస్సైల్స్ ఒకసారి ప్రయోగించాక వాటి దారి మార్చడం కష్టం. కానీ బైడూలోని ‘షార్ట్ మెసేజ్ సర్వీస్’ ఫీచర్ ద్వారా ఇరాన్ కమాండర్లు గాలిలో ఉన్న క్షిపణికి దారికి మార్చుకునేలా కొత్త సందేశాలు పంపగలుగుతున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ ఒక క్షిపణి ఎటు వస్తుందో అంచనా వేసి దాన్ని అడ్డుకోవడానికి తన మిస్సైల్‌ను వదిలినప్పుడు.. ఇరాన్ క్షిపణి బైడూ నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్ సిగ్నల్ ద్వారా చివరి క్షణంలో తన రూట్ మార్చుకుంటున్నది. ఫలితంగా అమెరికా రక్షణ క్షిపణులు గాలిలో దారి తప్పుతున్నాయి, ఇరాన్ క్షిపణులు లక్ష్యాన్ని చేరుతున్నాయి. ఇరాన్ తన ఆయుధాల సంఖ్యతో శత్రువును అలిసిపోయేలా చేస్తూనే, చైనా టెక్నాలజీతో అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తున్నది. అమెరికా కేవలం ఫిజికల్ యుద్ధమే కాదు, చైనా అందిస్తున్న ఈ ‘డిజిటల్’ యుద్ధాన్ని కూడా ఎదుర్కోవాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. పశ్చిమాసియాలో ఆయుధాల హోరు తగ్గేలా లేదు సరే.. కానీ ఈ కొత్త వ్యూహాలు భవిష్యత్తులో ప్రపంచ యుద్ధ తంత్రాన్నే మార్చేలా ఉన్నాయి.

షేర్ చేయండి:
3 మార్చి, 2026 02:40 PMకి