సారాంశం
కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల మధ్య వివాదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు సమసిపోవడం లేదు. తాజాగా నెమలి వేణు గోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో వారిద్దరి మధ్య ప్రొటోకాల్ చిచ్చు రేపింది. ఎంపీ చిన్నికి దేవస్థాన పురోహితులు అందజేసిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే బలవంతంగా లాక్కోవడం వివిదానికి దారితీసింది. స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు చిన్ని దంపతులకు అర్చకులు అందజేశారు. అయితే తనకు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే కొలికపూడి చేతులు చాచారు. దీంతో పురోహితులు ఇబ్బంది పడ్డారు.
3 మార్చి, 2026 11:24 AMకి